టాలీవుడ్ యంగ్ హీరో అక్కినేని నాగ చైతన్య నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘తండేల్’ ఇప్పటికే ప్రేక్షకుల్లో సాలిడ్ అంచనాలు క్రియేట్ చేసింది. దర్శకుడు చందూ మొండేటి డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమా పీరియాడిక్ నేపథ్యంలో సాగే ప్రేమకథ చిత్రంగా రానుంది. ఇక ఈ సినిమాలో అందాల భామ సాయి పల్లవి హీరోయిన్‌గా నటిస్తుండటంతో చైతూ-సాయి పల్లవి కెమిస్ట్రీ వెండితెరపై చూసేందుకు ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఉన్నారు.
ఇప్పటికే రిలీజ్ అయిన ఈ మూవీ పోస్టర్స్, టీజర్, ట్రైలర్ ఈ సినిమాపై అంచనాలను అమాంతం పెంచేశాయి. ఇక పాన్ ఇండియా స్థాయిలో ఈ మూవీని పలు భాషల్లో ప్రమోట్ చేస్తూ ఈ మూవీపై పాజిటివ్ వైబ్స్ క్రియేట్ చేశారు. కాగా, ఇప్పుడు ఈ సినిమాపై బజ్‌ను మరింతగా పెంచేలా ఈ సినిమా కోసం ఐకాన్ స్టార్ అల్లు అర్జున్‌ను తీసుకొస్తున్నారు చిత్ర యూనిట్.
‘తండేల్ జాతర’ కోసం అల్లు అర్జున్ చీఫ్ గెస్ట్‌గా రానున్నట్లు చిత్ర యూనిట్ వెల్లడించింది. ఫిబ్రవరి 1న సాయంత్రం 5 గంటలకు జరగబోయే ఈ ఈవెంట్‌ను హైదరాబాద్‌లో నిర్వహిస్తున్నారు. ఇలా తండేల్ రాజ్ కోసం పుష్ప రాజ్ వస్తే, ఈ సినిమాపై సాలిడ్ బజ్ క్రియేట్ కావడం ఖాయమని చిత్ర యూనిట్ భావిస్తుంది. ఇక ఈ సినిమాకు దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందించగా బన్నీ వాస్ ప్రొడ్యూస్ చేస్తున్నారు.