ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ప్రస్తుతం ఆయన నటించిన బిగ్గెస్ట్ బ్లాక్‌బస్టర్ ‘పుష్ప 2’ సక్సెస్‌ను ఎంజాయ్ చేస్తున్నాడు. ఈ సినిమాలో అల్లు అర్జున్ నటనకు ప్రేక్షకుల నుంచి మంచి మార్కులు పడ్డాయి. ఇక ఈ సినిమా సక్సెస్ తర్వాత ఆయన ప్రస్తుతం తన ఫ్యామిలీకి ఎక్కువ సమయం కేటాయిస్తున్నారు.
ఈ క్రమంలోనే తన తండ్రి, మెగా ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ పుట్టినరోజు అల్లు అర్జున్ తన కుటుంబ సభ్యులతో కలిసి జరుపుకున్నారు. తన తండ్రి చేత కేక్ కట్ చేయించారు బన్నీ. ఈ మేరకు తన సోషల్ మీడియాలో ఓ ఫొటోను షేర్ చేశాడు బన్నీ. తమ జీవితాలను అద్భుతంగా మలిచిన తన తండ్రికి ఇలా పుట్టినరోజు వేడుకను జరపడం సంతోషంగా ఉందని బన్నీ తెలిపాడు. ఇక సోషల్ మీడియాలో ఈ ఫోటో ప్రస్తుతం ట్రెండ్ అవుతోంది.