ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ప్రస్తుతం ‘పుష్ప 2’ మూవీతో ఇండియన్ బాక్సాఫీస్ దగ్గర ఎలాంటి సెన్సేషన్ క్రియేట్ చేశాడో అందరికీ తెలిసిందే. ఈ సినిమాను క్రియేటివ్ జీనియస్ సుకుమార్ తెరకెక్కించగా పూర్తి మాస్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా ఈ మూవీ బాక్సాఫీస్‌ను షేక్ చేసింది. ఇక ఈ సినిమా ఇచ్చిన సక్సెస్‌తో అల్లు అర్జున్‌తో పాటు చిత్ర యూనిట్ సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
ఇక సంక్రాంతి పర్వదినాన్ని పుష్ప రాజ్ తన ఫ్యామిలీతో కలిసి సెలబ్రేట్ చేసుకున్నాడు. తన భార్య స్నేహారెడ్డి తో పాటు పిల్లలతో కలిసి అల్లు అర్జున్ సంక్రాంతి పండుగను ఘనంగా జరుపుకున్నాడు. ఈ మేరకు అల్లు స్నేహా రెడ్డి తన సోషల్ మీడియా అకౌంట్‌లో తమ సంక్రాంతి వేడుకలను పోస్ట్ చేశారు.
ఈ ఫోటోల్లో అల్లు అర్జున్ కొత్త లుక్‌తో అభిమానులు ఆకట్టుకుంటున్నాడు. ఇక అల్లు ఫ్యామిలీ పండుగ సెలబ్రేషన్స్‌కు సంబంధించిన ఫోటోలు ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతున్నాయి.