అల్లు అర్జున్ తో పోటీపడుతున్న సూర్య..

allu-arjun-surya
స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ బోయపాటి శీను దర్శకత్వం లో వస్తున్న ’సరైనోడు’ వేసవిలో విడుదల అవుతున్న విషయం తెలిసిందే. మొదట ఈ సినిమాని ఉగాది కానుకగా ఏప్రిల్ 8 న విడుదల చేయాలని అనుకున్నారు కానీ అదేరోజు పవన్ కళ్యాణ్ ’సర్దార్ గబ్బర్ సింగ్’ విడుదల అవుతుండటం తో రెండు వారాలు ఆలస్యంగా ఏప్రిల్ 22 విడుదల చేయాలని భావించారు. బాక్సాఫీస్ దగ్గర ఇబ్బంది కలగకూడదనే రెండు వారాలు వాయిదా వేసినట్లు సమాచారం.

కానీ ఇప్పుడు అదే సమస్య మరో హీరో రూపంలో అల్లు అర్జున్ కి ఎదురవుతున్నదని సమాచారం. ఎందుకంటే హీరో సూర్య నటిస్తున్న ’24’ కూడా ఏప్రిల్ 22 న విడుదల అవుతున్నట్లు సమాచారం. ’మనం’ ఫేం దర్శకుడు విక్రం కుమార్ దర్శకత్వం లో వస్తున్న సైన్స్ ఫిక్షన్ థ్రిల్లర్ ’24’ ఈ వేసవిలో విడుదల అవుతున్న మంచి అంచనాలున్న సినిమాల్లో ఒకటిగా చెప్పుకోవచ్చు. కాకపోతే వీటిలో సూర్య సినిమా సైన్స్ ఫిక్షన్ థ్రిల్లర్ కాగా అల్లు అర్జున్ ’సరైనోడు’ పక్కా మాస్ ఎంటర్ టైనర్ అయినప్పటికీ ఒక విధంగా చూస్తే మాత్రం అల్లు అర్జున్ తో సూర్య పోటీ పడుతున్నట్లు అనిపిస్తుంది. మరి బాక్సాఫీస్ వద్ద విజయం ఎవరిని వరిస్తుందో చూడాలి..

Exit mobile version