అల్లు అర్జున్ కజిన్ నటిస్తున్న ‘గిల్ట్’ టైటిల్ పోస్టర్ రిలీజ్

అల్లు అర్జున్ కజిన్ నటిస్తున్న ‘గిల్ట్’ టైటిల్ పోస్టర్ రిలీజ్

Published on Sep 7, 2024 9:30 AM IST

టాలీవుడ్‌లో ప్రస్తుతం డిఫరెంట్ కంటెంట్ బేస్డ్ చిత్రాలను ఆడియెన్స్ ఎక్కువగా ఆదరిస్తున్నారు. రెగ్యులర్ కమర్షియల్ సినిమాల కంటే కాస్త భిన్నమైన కాన్సెప్ట్‌లే బాక్సాఫీస్ వద్ద ఎక్కువగా సక్సెస్ అవుతున్నాయి. ఈ క్రమంలో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కజిన్ విరాన్ ముత్తంశెట్టి హీరోగా ఓ కొత్త చిత్రం రాబోతోంది. ఇప్పటికే విరాన్ ముత్తంశెట్టి పలు సినిమాల్లో నటించి ఆడియెన్స్‌ను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు. రీసెంట్‌గా ‘పురుషోత్తముడు’ చిత్రంతో తన నటనతో మెప్పించారు.

విరాన్ ముత్తం శెట్టి హీరోగా రాజమండ్రి పరిసర ప్రాంతాల్లో తెరకెక్కనున్న ఈ మూవీ యూత్‌ఫుల్ లవ్ స్టోరీతో పాటుగా క్రైమ్, యాక్షన్, థ్రిల్లర్‌గా ఉండబోతోందని మేకర్స్ చెబుతున్నారు. శ్రీ కమలహాసిని మూవీ మేకర్స్ బ్యానర్‌పై లక్ష్మీ సునీల, డా.పార్థసారథి రెడ్డి, ఎ.శివ కుమార్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి చలపతి పువ్వల దర్శకత్వం వహిస్తున్నారు.

ప్రస్తుతం ఈ చిత్రానికి సంబంధించి ఇంట్రెస్టింగ్ టైటిల్‌ను ప్రకటించారు. ‘గిల్ట్’ అనే టైటిల్‌తో ఈ చిత్రం రాబోతోంది. ఈ మేరకు రిలీజ్ చేసిన టైటిల్ పోస్టర్ అందరినీ ఆకట్టుకునేలా ఉంది. టైటిల్‌తోనే సినిమా మీద అందరి దృష్టి పడేలా మేకర్స్ ప్లాన్ చేశారు. ఈ సినిమాకు మహావీర్ సంగీతం అందిస్తున్నారు. ఈ చిత్రానికి సంబంధించిన మరిన్ని అప్డేట్స్ రాబోయే రోజుల్లో వెల్లడిస్తామని మేకర్స్ తెలిపారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు