ఐకాన్ స్టార్ అల్లు అర్జున్‌ను సంధ్య థియేటర్ ఘటన కారణంగా శుక్రవారం చిక్కడపల్లి పోలీసులు అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. పోలీసులు ఆయన్ను విచారించిన అనంతరం వైద్య పరీక్షల నిమిత్తం గాంధీ ఆసుపత్రికి తరలించారు. వైద్య పరీక్షల అనంతరం అల్లు అర్జున్‌ని పోలీసులు నాంపల్లి కోర్టులో హాజరుపర్చారు.
అయితే, అల్లు అర్జున్‌కి నాంపల్లి కోర్టు 14 రోజుల రిమాండ్ విధించింది. దీంతో పోలీసులు ఆయనను చంచల్‌గూడ జైలుకి తరలించారు. ఈ నేపథ్యంలో చంచల్‌గూడ జైలు వద్ద భారీ బందోబస్తు ఏర్పాటు కూడా చేశారు. కాగా, హైకోర్టులో బన్నీ దాఖలు చేసిన క్వాష్ పిటిషన్ విచారణలో హైకోర్టు ఆయనకు మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. దీంతో ఆయనకు విధించిన రిమాండ్ రద్దు అయ్యింది. అల్లు అర్జున్ కు బెయిల్ మంజూరు కావడంతో అభిమానులు ఊపిరిపీల్చుకున్నారు.