అల్లు అర్జున్ విడుదల.. విజువల్స్ వైరల్.!

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ విషయంలో లేటెస్ట్ గా జరిగిన హంగామా అందరికీ తెలిసిందే. ప్రత్యక్షంగా తన ప్రమేయం లేకపోయినప్పటికీ తనని జైలుకి తరలించడం దేశ వ్యాప్తంగా న్యూస్ అయ్యింది. అయితే ఈ నిన్న తనని చెంచల్ గూడ పోలీస్ స్టేషన్ కి తెలంగాణ పోలీసులు తరలించగా నిన్ననే తనకి బైలు కూడా మంజూరు అయ్యింది.

కానీ అల్లు అర్జున్ మాత్రం ఈరోజు తెల్లవారుజాము 6 గంటల సమయంలో జైలు ప్రాంగణం నుంచి తన కారులో బయటకి వచ్చాడు. అయితే ఈ విడుదలకి సంబంధించిన విజువల్స్ ఇపుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. అల్లు అర్జున్ తన కార్ లో ఎవరితో ఫోన్ మాట్లాడుతూ వెళ్లినట్టుగా దృశ్యాలు కనిపిస్తున్నాయి. దీనితో ఈ వీడియో విజువల్స్ చూసి అల్లు అర్జున్ ఫ్యాన్స్ ఊపిరి పీల్చుకున్నారు. ఇక అల్లు అర్జున్ నటించిన పుష్ప 2 ది రూల్ ప్రస్తుతం భారీ వసూళ్లతో దేశ వ్యాప్తంగా దుమ్ము లేపుతున్న సంగతి తెలిసిందే.

Exit mobile version