బన్నీ – కొరటాల సినిమా పనులు వేగం పుంజుకున్నాయ్

Published on Feb 25, 2021 3:02 am IST


కొరటాల శివ, అల్లు అర్జున్ కాంబినేషన్లో సినిమా ఇటీవలే అధికారికంగా అనౌన్స్ అయింది. ఈ క్రేజీ కలయిక పట్ల ప్రేక్షకుల్లో, అభిమానుల్లో భారీ అంచనాలున్నాయి. కొరటాల శివ ప్రస్తుతం ‘ఆచార్య’ షూటింగ్లో బిజీగా ఉండగా అల్లు అర్జున్ ‘పుష్ప’ చిత్రీకరణలో బిజీగా ఉన్నారు. ఈ రెండు సినిమాలు పూర్తవడానికి ఇంకొన్ని నెలలు పడుతుంది. రెండూ దాదాపు ఒకేసారి పూర్తవుతాయి. ఆ తర్వాత కొంత గ్యాప్ తీసుకుని వీరు సినిమాను మొదలుపెట్టనున్నారు.

అయితే ఈలోపు ప్రీప్రొడక్షన్ పనులు ఊపందుకున్నాయి. కొరటాల శివ సినిమాలో బన్నీ లుక్ ఎలా ఉండాలో ఫైనలైజ్ చేసుకున్నారట. సినీ వర్గాల సమాచారం మేరకు ఇందులో అల్లు అర్జున్ అల్ట్రా పోష్ లుక్ లో కనిపిస్తారని తెలుస్తోంది. ‘పుష్ప’లో బన్నీ పూర్తిస్థాయి డీగ్లామర్ పాత్రలో కనిపిస్తున్నారు. కొరటాల శివ సినిమాలో ఇందుకు పూర్తి భిన్నం. సెప్టెంబర్ నుండి రెగ్యులర్ షూటింగ్ మొదలయ్యే ఆవకాశం ఉంది. సుధాకర్ మిక్కిలినేని ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్ కేటాయించి నిర్మిస్తున్నారు. ఇందులో నటీనటులు, సాంకేతిక నిపుణులు ఎవరనేది ఇంకా తెలియాల్సి ఉంది.

సంబంధిత సమాచారం :