క‌ల్కి సినిమాపై పుష్ప రాజ్ ట్వీట్.. ఔట్ స్టాండింగ్!

పాన్ ఇండియా స్టార్ ప్ర‌భాస్ లేటెస్ట్ ఎపిక్ మూవీ క‌ల్కి 2898 AD ప్రస్తుతం టాక్ ఆఫ్ ది నేష‌న్ గా మారిపోయింది. సౌత్, నార్త్ అనే తేడా లేకుండా మూవీ ల‌వ‌ర్స్ అంద‌రూ ఈ సినిమా గురించే మాట్లాడుతున్నారు. క‌ల్కి లాంటి సినిమా చాలా అరుదుగా వ‌స్తుంద‌ని అభిమానులు కామెంట్లు చేస్తున్నారు. ఇక క‌ల్కి మూవీపై సెల‌బ్రిటీల సైతం ప్ర‌శంస‌ల వ‌ర్షం కురిపిస్తున్నారు.

తాజాగా ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ క‌ల్కి టీమ్ ను అభినందించాడు. క‌ల్కి 2898 AD సినిమా ఔట్ స్టాండింగ్ గా ఉంద‌ని ఆయ‌న అన్నారు. విజువ‌ల్ గా క‌ల్కి మూవీ ఓ అద్భుతం అని.. ఇలాంటి సినిమాను అందించిన టీమ్ కు ధ‌న్య‌వాదాలు అని ఆయ‌న అన్నారు. సూపర్ హీరోలా ప్ర‌భాస్ ఈ సినిమాలో ఇర‌గ‌దీశాడ‌ని.. అమితాబ్ గురించి మాట్లాడేందుకు మాట‌ల్లేవ‌ని.. క‌మ‌ల్ హాస‌న్ డెడికేష‌న్ కు హ్యాట్సాఫ్ అంటూ బ‌న్నీ ట్వీట్ చేశాడు.

ఈ సినిమాలో దీపిక ప‌దుకొనె, దిశా ప‌టానిలు సైతం స్ట‌న్ చేశార‌ని ఆయ‌న అన్నారు. టెక్నిక‌ల్ టీమ్ వండ‌ర్ఫుల్ జాబ్ చేశార‌ని.. నిర్మాత‌లు రిస్క్ తీసుకుని ఇండియ‌న్ సినిమా స్థాయిని పెంచార‌ని.. నాగ్ అశ్విన్ ఈ సినిమాతో సినిమా ల‌వ‌ర్స్ ను మాయ చేశాడ‌ని.. ఇండియన్ క‌ల్చ‌ర్ కు సంబంధించిన సినిమా గ్లోబ‌ల్ ఆడియెన్స్ ను సైతం ఆక‌ట్టుకుంద‌ని బ‌న్నీ త‌న ట్వీట్ లో పేర్కొన్నాడు.

Exit mobile version