అల్లు అర్జున్ నట విశ్వరూపం వీడియో సాంగ్ వచ్చేసింది..

అల్లు అర్జున్ నట విశ్వరూపం వీడియో సాంగ్ వచ్చేసింది..

Published on Jan 3, 2025 1:00 PM IST

మన తెలుగు సినిమాలో ఉన్నటువంటి స్టార్ హీరోలలో మంచి నటన కనబరిచే అరుదైన హీరోస్ లో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కూడా ఒకరు. మరి తాను ఇన్నేళ్ల కెరీర్ లో పలు చిత్రాలకి సెటిల్డ్ అండ్ పర్ఫెక్ట్ నటన కనబరిచి ఆకట్టుకున్నారు. అయితే తన మొదటి పాన్ ఇండియా చిత్రం పుష్ప 1 కి జాతీయ స్థాయి అవార్డు వస్తే పార్ట్ 2 లో అంతకు మించిన నటన కనబరిచి అందరినీ ఆశ్చర్యానికి లోను చేసాడు.

మరి ఈ సినిమాలో అల్లు అర్జున్ లోని నటుడుని ఓ రేంజ్ లో చూపించిన సీక్వెన్స్ లలో జాతర సాంగ్ కూడా ఒకటి. దర్శకుడు సుకుమార్ విజన్ తో అల్లు అర్జున్ తన నట విశ్వరూపం ఈ సాంగ్ కి చూపించాడు అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. అయితే సినిమా థియేటర్స్ లో వరకు ఒక బిగ్ సర్ప్రైజ్ గా దాచి ఉంచారు.

అలా దాచి ఉంచిన ఈ సాంగ్ ని అల్లు అర్జున్ తన పెర్ఫామెన్స్ తో ఇంకో లెవెల్ కి తీసుకెళ్లి అనుకున్న దానికంటే ఎక్కువ స్పంద అందుకునేలా చేసాడు. అయితే ఎట్టకేలకి ఈ సాంగ్ ని మేకర్స్ అధికారికంగా ఫుల్ వీడియో సాంగ్ ని వదిలేసారు. సో ఇపుడు దేవిశ్రీ ప్రసాద్ కంపోజ్ చేసిన ఈ పవర్ఫుల్ సాంగ్ అని అలాగే దానిని మరింత పవర్ఫుల్ గా మార్చిన అల్లు అర్జున్ నట విశ్వరూపాన్ని యూట్యూబ్ లోనే చూడొచ్చు.

సాంగ్ కోసం ఇక్కడ ఇక్కడ క్లిక్ చెయ్యండి

సంబంధిత సమాచారం

తాజా వార్తలు