బన్నీ – ప్రశాంత్ నీల్.. పనులు మొదలయ్యాయట

బన్నీ – ప్రశాంత్ నీల్.. పనులు మొదలయ్యాయట

Published on Mar 9, 2021 6:07 PM IST

అల్లు అర్జున్ తన సినీ ప్రయాణాన్ని చాలా జాగ్రత్తగా ప్లాన్ చేసుకుంటూ వెళ్తున్నారు. ఒక్కొక మెట్టూ ఎక్కుతూ పాన్ ఇండియా స్థాయికి చేరుకునే ప్రయత్నాల్లో ఉన్నారు. ‘అలవైకుంఠపురములో’ చిత్రంతో అగ్ర హీరోల జాబితాలో పర్మినెంట్ ప్లేస్ దక్కించుకున్న ఆయన ఇప్పుడు సుకుమార్ డైరెక్షన్లో ‘పుష్ప’ చేస్తున్నారు. భారీ వ్యయంతో తెరకెక్కుతున్న ఈ చిత్రంతో సౌత్ ఇండియా మార్కెట్లో తన స్టామినాను చూపాలనుకుంటున్నారు బన్నీ.

ఇక ఆ తర్వాతి అడుగుగా పాన్ ఇండియా స్థాయి మీద దృష్టి పెట్టారు. అందుకోసం ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ఒక సినిమాను సెట్ చేసుకున్నారు. చాలా రోజుల నుండి చర్చల దశలో ఉన్న ఈ చిత్రం దాదాపు ఖాయమైనట్టే అంటున్నాయి ఫిల్మ్ నగర్ వర్గాలు. ఈరోజు గీతా ఆర్ట్స్ ఆఫీస్ నందు కథా చర్చలు కూడ మొదలయ్యాయట. ప్రజెంట్ ‘సలార్’ చేస్తున్న ప్రశాంత్ నీల్ నెక్స్ట్ ఎన్టీఆర్ సినిమా చేయాల్సి ఉంది. అది పూర్తయ్యాక బన్నీ సినిమా ఉండొచ్చు. అంటే 2022 లేదా 2023లో వీరి చిత్రం సెట్స్ మీదకు వెళ్లే అవకాశం ఉంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు