స్టార్ హీరో అల్లు అర్జున్ లేటెస్ట్ మూవీ ‘పుష్ప-2’ రిలీజ్ సందర్భంగా ఏర్పాటు చేసిన ప్రీమియర్ షోలో సంధ్య థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాటలో రేవతి అనే మహిళ మృతి చెందింది. ఆమె కుమారుడు శ్రీతేజ్ తీవ్ర గాయాలతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. అయితే, ఈ ఘటనపై అల్లు అర్జున్‌పై కేసు నమోదై, ఆయన్ను పోలీసులు అరెస్ట్ చేసి జైలుకి పంపారు. హైకోర్టు మధ్యంతర బెయిల్ ఇవ్వడంతో ఆయన రిలీజ్ అయ్యారు.
అయితే, ఈ ఘటనపై నేడు తెలంగాణ అసెంబ్లీ సమావేశాల్లో సీఎం రేవంత్ రెడ్డి మరోసారి సంచలన కామెంట్స్ చేశారు. అల్లు అర్జున్‌పై సీఎం రేవంత్ రెడ్డి విరుచుకుపడ్డారు. దీంతో మరోసారి ఈ వివాదం తెరపైకి రావడంతో, హీరో అల్లు అర్జున్ తాజాగా ప్రెస్ మీట్‌లో మాట్లాడుతున్నారు. ఇలాంటి ఘటన చోటుచేసుకోవడం నిజంగా బాధాకరం అని.. ఈ ప్రమాదంలో గాయపడిన శ్రీ తేజ్ ఆరోగ్యం గురించి ఆసుపత్రి నుంచి గంట గంటకు ఆరా తీస్తున్నామని ఆయన తెలిపారు. ఇంకా సీఎం చేసిన పలు వ్యాఖ్యలపై అల్లు అర్జున్ మాట్లాడుతున్నారు.