బ్రేకింగ్: జైలు నుంచి అల్లు అర్జున్ విడుదల

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ అరెస్ట్‌తో టాలీవుడ్ ఒక్కసారిగా షాక్‌కి గురయ్యింది. సంధ్య థియేటర్ వద్ద జరిగిన ఘటనలో భాగంగా అల్లు అర్జున్‌ను చిక్కడపల్లి పోలీసులు శుక్రవారం అరెస్ట్ చేసి నాంపల్లి కోర్టులో ప్రవేశపెట్టగా, ఆయనకు కోర్టు 14 రోజుల రిమాండ్‌ను విధించింది. దీంతో ఆయనను చంచల్‌గూడ జైలుకు తరలించారు. అయితే, హైకోర్టు మధ్యంతర బెయిల్ మంజూరు చేయడంతో అభిమానులు ఊపిరి పీల్చుకున్నారు. కానీ, బెయిల్ వచ్చినా అల్లు అర్జున్ మాత్రం జైలు నుంచి రిలీజ్ కాలేదు. తమకు బెయిల్ కాపీ రాలేదని అధికారులు అల్లు అర్జున్‌ని జైలులోనే పెట్టారు. దీంతో ఆయన రిలీజ్‌లో జాప్యం చోటు చేసుకుంది.

ఇక తాజాగా అల్లు అర్జున్ జైలు నుంచి విడుదల అయ్యారు. అల్లు అర్జున్ చంచల్‌గూడ జైలు నుండి బయటకు రావడంతో అభిమానులు సంతోషం వ్యక్తం చేశారు. ఇక అల్లు అర్జున్ అరెస్ట్ నేపథ్యంలో మెగాస్టార్ చిరంజీవి, నాగబాబు సహా పలువురు ప్రముఖులు అల్లు అర్జున్ ఇంటికి వెళ్లి ఆయన కుటుంబ సభ్యులకు భరోసా కలిగించారు.

Exit mobile version