పర్సనల్ సీక్రెట్‌ను రివీల్ చేసిన అల్లు అర్జున్

పర్సనల్ సీక్రెట్‌ను రివీల్ చేసిన అల్లు అర్జున్

Published on Nov 20, 2024 9:59 PM IST

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ప్రస్తుతం తన మోస్ట్ అవైటెడ్ మూవీ ‘పుష్ప-2’ని ప్రమోట్ చేసే పనిలో ఉన్నాడు. ఇప్పటికే ఆయన నందమూరి బాలకృష్ణ హోస్ట్ చేస్తున్న అన్‌స్టాపబుల్ విత్ ఎన్‌బికె టాక్ షోలో ఈ చిత్రాన్ని ప్రమోట్ చేస్తూ కనిపించారు. తాజాగా ఈ ఎపిసోడ్‌లో ఓ ఇంట్రెస్టింగ్ విషయాన్ని అల్లు అర్జున్ రివీల్ చేసినట్లుగా తెలుస్తోంది.

తన పర్సనల్ లైఫ్‌కి సంబంధించిన ఈ విషయం తాను ఇప్పటివరకు ఎక్కడా రివీల్ చేయలేదని చెబుతున్నారు. తనకు తన భార్య స్నేహా రెడ్డికి ఓ సీక్రెట్ వాట్సాప్ గ్రూప్ ఉందని.. ఇందులో తమ వ్యక్తిగత విషయాలను, సీక్రెట్స్, తప్పొ్ప్పులు, చివరకు ఫైట్స్ కూడా డిస్కస్ చేసుకుంటామని అల్లు అర్జున్ తెలిపాడు.

ఈ సీక్రెట్ వాట్సాప్ గ్రూప్‌పై బన్నీ ఓపెన్ కావడంతో అభిమానులు ఆసక్తిగా దీనికి సంబంధించిన విషయాలను వింటున్నారు. ఈ ఎపిసోడ్‌లో స్నేహా రెడ్డి, బన్నీకి సంబంధించిన మరిన్ని పర్సనల్ విషయాలను కూడా ఆయన వెల్లడించనున్నట్లు తెలుస్తోంది. ఈ స్పెషల్ ఎపిసోడ్‌ను ఆహాలో నవంబర్ 22న స్ట్రీమింగ్ చేయనున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు