‘పుష్ప-2’ మూవీ రిలీజ్ సందర్భంగా సంధ్య థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాట ప్రమాదానికి సంబంధించి తెలంగాణ అసెంబ్లీలో సీఎం రేవంత్ రెడ్డి చేసిన సంచలన వ్యాఖ్యలు సరికొత్త వివాదానికి తెరలేపాయి. హీరో అల్లు అర్జున్‌కు ప్రమాదం జరిగిందని తెలిసినా కూడా ఆయన సినిమా చూస్తూ ఉన్నారని రేవంత్ చేసిన కామెంట్స్‌పై తాజాగా అల్లు అర్జున్ ప్రెస్ మీట్‌లో వివరణ ఇచ్చారు.
తాను ఎప్పటినుంచో అభిమానులతో కలిసి సినిమా చూస్తున్నాని.. అయితే, ఆ రోజు జరిగిన ప్రమాదం గురించి తనకు మరుసటి రోజు వరకు ఎలాంటి సమాచారం లేదని.. ఇలాంటి ప్రమాదం గురించి తెలిసినా కూడా సినిమా చూస్తూ ఎలా కూర్చుంటాం.. ఇలా తనపై తప్పుడు ప్రచారం చేయవద్దని ఆయన ప్రెస్ మీట్‌లో కోరారు.