క్రేజీ : ఇన్స్టాగ్రామ్ లో అల్లు అర్జున్ సెన్సేషనల్ రికార్డు

క్రేజీ : ఇన్స్టాగ్రామ్ లో అల్లు అర్జున్ సెన్సేషనల్ రికార్డు

Published on Mar 20, 2024 7:28 PM IST

టాలీవుడ్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ప్రస్తుతం పుష్ప 2 మూవీతో బిజీగా ఉన్నారు. రష్మిక మందన్న హీరోయిన్ గా నటిస్తున్న ఈ మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ మూవీ పై అందరిలో భారీ అంచనాలు ఉన్నాయి. సుకుమార్ దర్శకత్వంలో మైత్రి మూవీ మేకర్స్ మేకర్స్ నిర్మిస్తున్న ఈ మూవీని ఆగష్టు 15న విడుదల చేయనున్నారు. ఇక సోషల్ మీడియాలో అల్లు అర్జున్ కి మంచి క్రేజ్ ఉంది.

ముఖ్యంగా ఇన్స్టాగ్రామ్ లో ఎప్పటికప్పుడు తన సినీ వ్యక్తిగత విషయాలు షేర్ చేసుకునే అల్లు అర్జున్ నేడు అందులో 25 మిలియన్ ఫాలోవర్స్ ని చేరుకున్నారు. కాగా ఇంతటి భారీ స్థాయిలో ఫాలోవర్స్ ని అందుకున్న తొలి సౌత్ ఇండియన్ స్టార్ గా సెన్సేషనల్ రికార్డు సొంతం చేసుకున్నారు అల్లు అర్జున్.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు