బన్నీ బ్యూటిఫుల్ వీడియో.. గణేశుని పూజలో అర్హ

ప్రస్తుతం ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా రష్మిక మందన్నా హీరోయిన్ గా దర్శకుడు సుకుమార్ తెరకెక్కిస్తున్న భారీ పాన్ ఇండియా చిత్రం “పుష్ప 2” కోసం అందరికీ తెలిసిందే. మరి ఈ సినిమా షూట్ లో బన్నీ బిజీగా ఉండగా లేటెస్ట్ గా అయితే ఓ బ్యూటిఫుల్ వీడియోని సోషల్ మీడియాలో షేర్ చేసుకున్నాడు. మొదటిగా బన్నీ అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు తెలియజేయగా ఈ తర్వాత తన ఇంట్లో జరిగిన పూజ తాలూకా వీడియో విజువల్స్ ని తాను షేర్ చేసుకున్నాడు.

మరి ఇందులో తన చిట్టి కూతురు అల్లు అర్హ ఎంతో నిష్ఠగా పూజలో కూర్చుని కనిపిస్తుంది. దీంతో ఈ బ్యూటిఫుల్ వీడియోని ఐకాన్ స్టార్ తన సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా ఇది చూసిన తన ఫ్యాన్స్ సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఇక పుష్ప 2 సినిమాపై భారీ హైప్ ప్రస్తుతం నెలకొనగా ఈ చిత్రం ఈ డిసెంబర్ 6 న భారీ లెవెల్లో పాన్ ఇండియా భాషల్లో విడుదలకి రాబోతున్న సంగతి తెలిసిందే.

Exit mobile version