ఒక్క “పుష్ప 2” క్లైమాక్స్ కోసమే ఇన్ని రోజులా.. ఐకాన్ స్టార్ డెడికేషన్ కి హ్యాట్సాఫ్

ఒక్క “పుష్ప 2” క్లైమాక్స్ కోసమే ఇన్ని రోజులా.. ఐకాన్ స్టార్ డెడికేషన్ కి హ్యాట్సాఫ్

Published on Dec 12, 2024 11:04 PM IST

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా నటించిన లేటెస్ట్ పాన్ ఇండియా హిట్ చిత్రం “పుష్ప 2 ది రూల్” కోసం అందరికీ తెలిసిందే. మరి ఎన్నో అంచనాలు నడుమ వచ్చిన ఈ చిత్రం ఇండియన్ సినిమా దగ్గర ఫాస్టెస్ట్ 1000 కోట్ల సినిమాగా నిలిచి రికార్డు సెట్ చేసింది. ఇక ఈ భారీ సక్సెస్ తో మేకర్స్ ఢిల్లోలో నేడు థాంక్స్ మీట్ ని అక్కడి మీడియాతో పెట్టి ఘనంగా సెలబ్రేట్ చేసుకున్నారు. అయితే ఈ ఈవెంట్ లోనే పుష్ప 2 పై ఆసక్తికర అంశాలు కొన్ని మేకర్స్ షేర్ చేసుకున్నారు.

ఇలా పుష్ప 2 క్లైమాక్స్ ఎపిసోడ్ పై ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ ని ఇపుడు షేర్ చేసుకున్నారు. ఈ మొత్తం ఎపిసోడ్ ని ఏకంగా 32 రోజులు పాటు చిత్రీకరించారట. అలాగే ఈ అన్ని రోజుల్లో కూడా అల్లు అర్జున్ తాళ్ల సాయంతోనే చాలా కష్టతరంగా ఈ యాక్షన్ ఎపిసోడ్ అంతటినీ చేసాడట. మరి ఆ సమయంలో ఏమైనా తేడా జరిగితే అక్కడే ఫిజియో స్పెషలిస్ట్ లు కూడా ఉండి చేశారట. దీనితో అల్లు అర్జున్ డెడికేషన్ ని చూపించారు అని నిర్మాత రవి శంకర్ రివీల్ చేశారు. దీనితో అల్లు అర్జున్ చూపించిన డెడికేషన్ కి హ్యాట్సాఫ్ అని చెప్పొచ్చు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు