ఏపీ ప్రభుత్వానికి పుష్పరాజ్ స్పెషల్ థ్యాంక్స్

ఏపీ ప్రభుత్వానికి పుష్పరాజ్ స్పెషల్ థ్యాంక్స్

Published on Dec 3, 2024 1:00 AM IST

దేశవ్యాప్తంగా ‘పుష్ప-2’ రిలీజ్ కోసం ఎంతో ఆసక్తిగా చూస్తున్నారు. ఈ సినిమాను డిసెంబర్ 5న గ్రాండ్ రిలీజ్ చేస్తుండగా తెలుగు రాష్ట్రాల్లో ఈ చిత్రానికి సంబంధించిన టికెట్ రేట్ల పెంపుకు ప్రభుత్వ అనుమతులు లభించాయి. ఈమేరకు చిత్ర యూనిట్ తాజాగా ఏపీ ప్రభుత్వానికి తమ ధన్యవాదాలు తెలుపుతున్నారు. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఏపీ సీఎం, డిప్యూటీ సీఎం లకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలిపాడు.

‘పుష్ప-2’ సినిమా టికెట్ రేట్ల పెంపుకు ఏపీ ప్రభుత్వం ఎంతో సహకరించిందని.. సినిమా పరిశ్రమ పట్ల ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చూపిస్తున్న ప్రత్యేక శ్రద్ధకు వారికి మనస్పూర్తిగా ధన్యవాదాలు తెలుపుతున్నట్లు బన్నీ తాజాగా తన సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. ఇక డిసెంబర్ 4న స్పెషల్ ప్రీమియర్లకు ఏకంగా రూ.944 గా టికెట్ రేట్లను ఫిక్స్ చేయగా.. మొదటి రోజు నుండి 13వ రోజు వరకు సింగిల్ స్క్రీన్స్‌లో రూ.324.50, మల్టీప్లె్క్స్‌లలో రూ.413గా టికెట్ రేట్లను పెంచుకునేందుకు ఏపీ ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు