చిరుకి అల్లు అర్జున్ స్పెషల్ థాంక్స్.!

చిరుకి అల్లు అర్జున్ స్పెషల్ థాంక్స్.!

Published on Jun 18, 2015 8:27 AM IST

allu-arjun-and-chiranjeevi-
దాదాపు 8 సంవత్సరాల తర్వాత తన 150వ సినిమాతో మెగాస్టార్ చిరంజీవి మళ్ళీ తెరపైకి రానున్నాడు. ఆగష్టులో ప్రారంభం కానున్న ఈ సినిమా ప్రీ ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. ఇదిలా ఉంటే తెలుగు చిత్ర సీమలో ఓ మంచి సినిమాకి సాయం కావాలి అంటే చిరంజీవి ఎప్పుడూ ముందుంటారు. చిరంజీవి తాజాగా టాలీవుడ్ లో తెరకెక్కిన భారీ పీరియాడికల్ 3డి ఫిల్మ్ ‘రుద్రమదేవి’ సినిమాకి వాయిస్ ఓవర్ అందించాడు. ఈ సినిమాకి చిరు అందించిన వాయిస్ ఓవర్ సినిమాకి పెద్ద హెల్ప్ అవుతుందని ఈ చిత్ర టీం చెబుతోంది.

ఇదిలా ఉంటే రుద్రమదేవి సినిమాలో అతి కీలకమైన గోనగన్నా రెడ్డి పాత్రలో స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ కనిపించనున్న సంగతి మనకు తెలిసిందే. వాయిస్ ఓవర్ విషయంలో అల్లు అర్జున్ చిరంజీవికి స్పెషల్ థాంక్స్ చెప్పారు. ‘ రుద్రమదేవి సినిమాకి చిరంజీవి గారు వాయిస్ ఓవర్ ఇవ్వడం చాలా ఆనందంగా ఉంది. చెప్పాలంటే ది బెస్ట్ ఛాయస్ ఇది. ఎంతో మంచి హృదయం కలిగిన కింగ్ చేసిన ఓ మంచి పని’ అని అల్లు అర్జున్ సోషల్ మీడియా ద్వారా తెలియజేశాడు. అనుష్క టైటిల్ రోల్ లో కనిపించనున్న ఈ సినిమాలో రానా, కృష్ణం రాజు, నిత్య మీనన్, కేథరిన్, హంసా నందిని, ప్రకాష్ రాజ్ తదితరులు ముఖ్య పాత్రల్లో కనిపించనున్నారు. మాస్ట్రో ఇళయరాజా మ్యూజిక్ అందించిన ఈ సినిమాకి తోట తరణి ఆర్ట్ డైరెక్టర్.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు