లేటెస్ట్.. తన ఫ్యాన్స్ కి ఐకాన్ స్టార్ స్ట్రిక్ట్ సూచనలు..

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా రష్మికా మందన్నా హీరోయిన్ గా నటించిన లేటెస్ట్ భారీ చిత్రం “పుష్ప 2 ది రూల్” కోసం అందరికీ తెలిసిందే. మరి ఎన్నో అంచనాలు నెలకొల్పుకున్న ఈ చిత్రం ఇండియా వైడ్ గా రికార్డు వసూళ్లు సాధించి అదరగొట్టింది. అయితే ఈ సినిమా రిలీజ్ తోనే అల్లు అర్జున్ పలు కాంట్రవర్సీల్లో కూడా ఇరుక్కోవాల్సి వచ్చింది. ఈ నేపథ్యంలో తన అభిమానులు అలాగే తన అభిమానులు ముసుగులో ఫేక్ ఐడిలతో పోస్టులు పెట్టేవారికి తన సైడ్ నుంచ్చి స్ట్రిక్ట్ సూచనలు అందించాడు.

సోషల్ మీడియాలో తన అభిమానులు అభిప్రాయాలు బాధ్యతాయుతంగా చెప్పాలని అలాగే తన అభిమానులు ముసుగులో ఉన్న ఫేక్ ఐడిలతో ఫేక్ పోస్ట్ లు వేస్తున్నవారిపై చర్యలు ఉంటాయని తన మార్క్ వార్నింగ్ ని బన్నీ అందించాడు. అలాగే నెగిటివ్ పోస్ట్ లు వేస్తున్న వారికి దూరంగా నా ఫ్యాన్స్ ఉండాలి అంటూ వారికి సూచనలు తాను అందించాడు. దీనితో తన నుంచి ఈ పోస్ట్ ఇపుడు వైరల్ గా మారింది.

Exit mobile version