తెలంగాణ ప్రభుత్వానికి అల్లు అర్జున్ థ్యాంక్స్

టాలీవుడ్ ప్రెస్టీజియస్ మూవీ ‘పుష్ప-2’ మరికొన్ని గంటల్లో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇక ఈ సినిమాతో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, దర్శకుడు సుకుమార్ మరోసారి మ్యాజిక్ చేయడం ఖాయమని ప్రేక్షకులు ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఈ సినిమాను అత్యంత భారీ స్థాయిలో రిలీజ్ చేస్తుండగా తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమా కోసం టికెట్ రేట్లు పెంచారు.

ఏపీ ప్రభుత్వంతో పాటు తెలంగాణ ప్రభుత్వం కూడా పుష్ప 2 చిత్రానికి టికెట్ రేట్లు పెంచుకునేందుకు అనుమతులు జారీ చేసింది. అంతేగాక, ప్రత్యేక షోలు ప్రదర్శించుకునేందుకు కూడా ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. దీంతో అల్లు అర్జున్ తెలంగాణ ప్రభుత్వానికి తన కృతజ్ఞతలు తెలిపాడు. తెలుగు సినిమా అభివృద్ధికి సీఎం రేవంత్ రెడ్డి సర్కార్ చేస్తున్న సహాయం మరువలేనిదని బన్నీ ఈ సందర్భంగా తెలిపాడు. సినిమాటోగ్రఫీ మంత్రి వెంకట్ రెడ్డి కోమటిరెడ్డికి కూడా ఆయన ఈ సందర్భంగా స్పెషల్ థ్యాంక్స్ తెలిపాడు.

ఇక రెగ్యులర్ షోలతో పాటు ప్రీమియర్ షోలకు కూడా టికెట్ రేట్లు భారీగా పెరగనున్నాయి. దీంతో చిత్ర నిర్మాతలు లాభాల బాట పట్టడం ఖాయమని సినీ సర్కిల్స్‌లో చర్చ జరుగుతోంది.

Exit mobile version