టాక్..ఈ భారీ నిర్మాణ సంస్థతో ఐకాన్ స్టార్ బిగ్ ప్రాజెక్ట్.?

Published on Jan 19, 2022 12:15 pm IST


ప్రస్తుతం మన టాలీవుడ్ కి చెందిన హీరోల్లో పాన్ ఇండియన్ వైడ్ జోరుగా వినిపిస్తున్న మరో హీరో పేరు అల్లు అర్జున్. తన కెరీర్ ని స్టైలిష్ స్టార్ ట్యాగ్ నుంచి ఐకాన్ స్టార్ అనే ట్యాగ్ కి మార్చేసిన తన లేటెస్ట్ పాన్ ఇండియా బ్లాక్ బస్టర్ “పుష్ప ది రైజ్” చర్చ ఇప్పటికీ కూడా నడుస్తుంది.

ఇక ఇదిలా ఉండగా ఈ సినిమా విజయం తర్వాత అల్లు అర్జున్ లైనప్ పై మరింత ఆసక్తి రేగింది. మరి ఇందులో భాగంగానే బన్నీ వద్దకు పలు భారీ నిర్మాణ సంస్థలే వస్తుండగా లేటెస్ట్ గా ఓ ఇంట్రెస్టింగ్ టాక్ బయటకొచ్చింది. కోలీవుడ్ కి చెందిన భారీ సినిమాల నిర్మాణ సంస్థల్లో ఒకటైన లైకా ప్రొడక్షన్ హౌస్ వారు అల్లు అర్జున్ తో ఓ బిగ్ ప్రాజెక్ట్ చెయ్యడానికి రెడీగా ఉన్నారట.

ఇది కూడా పాన్ ఇండియన్ లెవెల్లోనే ఉండొచ్చని టాక్. మరి దీనికి సంబంధించి మరింత సమాచారం రావాల్సి ఉంది. అయితే ఆల్రెడీ వీరి బ్యానర్ లోనే పుష్ప సినిమా తమిళ్ వెర్షన్ లో రిలీజ్ అయ్యిన సంగతి తెలిసిందే.

సంబంధిత సమాచారం :