అట్లీ సినిమాలో అల్లు అర్జున్ అలా కనిపిస్తాడా..?

అట్లీ సినిమాలో అల్లు అర్జున్ అలా కనిపిస్తాడా..?

Published on Mar 22, 2025 4:09 PM IST

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన ‘పుష్ప-2’ బాక్సాఫీస్ దగ్గర సెన్సేషనల్ హిట్‌ను అందుకుంది. ఇక ఈ సినిమా తర్వాత తన నెక్స్ట్ మూవీ కోసం బన్నీ రెడీ అవుతున్నాడు. అయితే, తమిళ దర్శకుడు అట్లీ దర్శకత్వంలో బన్నీ ఓ సినిమా చేయబోతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాకు సంబంధించి రోజుకో వార్త సినీ సర్కిల్స్‌లో జోరుగా చక్కర్లు కొడుతోంది.

ఈ సినిమాను పూర్తి యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా దర్శకుడు అట్లీ తెరకెక్కించబోతున్నాడట. అయితే, ఈ సినిమాలో అల్లు అర్జున్ రెండు డిఫరెంట్ పాత్రల్లో నటించబోతున్నాడని.. ఒకటి హీరో పాత్ర అవగా.. రెండోది నెగిటివ్ షేడ్స్ ఉన్న విలన్ పాత్ర అని తెలుస్తోంది. పుష్ప రాజ్ తరహా పాత్రలో బన్నీ ఇంపాక్ట్ సూపర్‌గా ఉండటంతో, ఇప్పుడు ఈ సినిమాలోనూ ఓ నెగెటివ్ పాత్ర ఉందని.. అందులో బన్నీ నటించాలని కోరుతున్నాడట.

మొత్తానికి అట్లీ సినిమాతో అల్లు అర్జున్ తన కెరీర్‌లోనే తొలిసారి డ్యుయల్ రోల్ పాత్రల్లో నటించబోతున్నాడని తెలుస్తోంది. మరి నిజంగానే బన్నీ ఈ సినిమాలో రెండు పాత్రల్లో కనిపిస్తాడా లేదా అనేది చూడాలి.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు