న్యూ ఇయర్ గిఫ్ట్ రెడీ చేస్తున్న ‘పుష్ప’..?

న్యూ ఇయర్ గిఫ్ట్ రెడీ చేస్తున్న ‘పుష్ప’..?

Published on Dec 29, 2024 12:31 AM IST

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన లేటెస్ట్ మూవీ ‘పుష్ప-2’ బాక్సాఫీస్ దగ్గర సెన్సేషనల్ రికార్డులను క్రియేట్ చేస్తూ దూసుకెళ్తుంది. ఈ సినిమాను క్రియేటివ్ జీనియస్ సుకుమార్ తెరకెక్కించిన తీరుకు ప్రేక్షకులు ఫిదా అవుతున్నారు. ఇక ఈ సినిమాను చూసేందుకు వారు థియేటర్లకు క్యూ కడుతున్నారు. సౌత్, నార్త్ అంటూ తేడా లేకుండా ఈ సినిమాను చూసి ఆడియన్స్ ఎంజాయ్ చేస్తున్నారు.

అటు బాక్సాఫీస్ దగ్గర ఈ సినిమా ఇప్పటికే రూ.1719 కోట్ల గ్రాస్ వసూళ్లు సాధించి సరికొత్త సెన్సేషన్ క్రియేట్ చేసింది. అయితే, ఈ సినిమాకు సంబంధించి హీరో అల్లు అర్జున్ నూతన సంవత్సరం కానుకగా ఓ అదిరిపోయే ట్రీట్ ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమా రన్‌టైమ్ 3 గంటల 21 నిమిషాలుగా ఉన్న సంగతి తెలిసిందే. అప్పటికే రన్ టైమ్ ఎక్కువయ్యింది, ఈ సినిమాలోని కొన్ని కీలక సీన్స్‌ను ఎడిటింగ్‌లో తీసేశారట మేకర్స్.

ఇప్పుడు న్యూ ఇయర్ నుంచి ఈ సీన్స్‌ను సినిమాలో యాడ్ చేయనున్నారట. ముఖ్యంగా హీరో ఇంట్రొడక్షన్ సీన్ జపాన్‌లో జరిగిన సంగతి తెలిసిందే. అయితే, ఆ సీన్ అర్ధాంతరంగా ముగించినట్లుగా అనిపిస్తుంది. దానికి సంబంధించిన కొన్ని సీన్స్‌ను ఇప్పుడు యాడ్ చేయబోతున్నారట. ఇక అల్లు అర్జున్ ఇప్పుడు ఈ సీన్స్‌కి సంబంధించిన డబ్బింగ్ చెబుతున్నట్లు సినీ సర్కిల్స్‌లో వార్తలు వినిపిస్తున్నాయి. మరి ఈ కొత్త సీన్స్ ఎలా ఉండబోతున్నాయో చూడాలి.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు