ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా రష్మిక మందన్నా హీరోయిన్ గా దర్శకుడు సుకుమార్ తెరకెక్కించిన భారీ పాన్ ఇండియా చిత్రం “పుష్ప 2” ఇపుడు ఇండియన్ సినిమా దగ్గర ఇండస్ట్రీ హిట్ కోసం అందరికీ తెలిసిందే. అయితే ఈ చిత్రం రిలీజ్ సమయంలో జరిగిన విషాదం కోసం అందరికీ తెలిసిందే. సంధ్య 70ఎంఎం థియేటర్ వద్ద ఓ కుటుంబం తొక్కిసలాటలో తీరని విషాదానికి లోను కావాల్సి వచ్చింది.
అయితే ఈ ప్రమాదంలోనే శ్రీతేజ్ అనే పిల్లాడు కూడా ఇప్పటికీ ప్రాణాలతో పోరాడుతున్నాడు. అయితే ఈ అల్లు అర్జున్ సహా పుష్ప మేకర్స్ కూడా శ్రీతేజ్ కుటుంబానికి ఆర్ధికంగా భరోసా ఇవ్వగా లేటెస్ట్ గా అయితే అల్లు అర్జున్ శ్రీతేజ్ ని కలిసి పరామర్శించేందుకు సిద్ధం అయ్యాడు.
ప్రస్తుతం శ్రీతేజ్ కి కిమ్స్ ఆసుపత్రిలో ఉన్నతమైన వైద్యం అందిస్తుండగా నేడు 10 గంటలకి అలా అల్లు అర్జున్ పరామర్శించేందుకు వెళుతున్నారు. అలాగే దీనిపై తాను ఆల్రెడీ రాంపేట పోలీస్ స్టేషన్ కి సమాచారం కూడా ఇచ్చి వెళుతున్నాడట. దీనిపై మరిన్ని డీటెయిల్స్ మీటింగ్ తర్వాత రానున్నాయి.