శనివారం రోజునే అల్లు అర్జున్ విడుదల

అల్లు అర్జున్ అరెస్ట్ నేపథ్యంలో ఉత్కంఠ పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. నాంపల్లి కోర్టు విధించిన 14 రోజుల రిమాండ్‌లో భాగంగా పోలీసులు ఆయనను చంచల్‌గూడ జైలుకు తరలించారు. అయితే, ఈ క్రమంలోనే హైకోర్టులో అల్లు అర్జు్న్‌కు మధ్యంత బెయిల్ మంజూరు కావడంతో ఆయన జైలు నుంచి విడుదల అవుతారని అందరూ ఆసక్తిగా చూస్తున్నారు.

కానీ, అల్లు అర్జున్ విడుదల శనివారం రోజునే ఉండనుందని జైలు అధికారులు వెల్లడించారు. శనివారం ఉదయం 6 గంటల తరువాతే అల్లు అర్జున్ విడుదల ఉంటుందని వారు తెలిపారు. అయితే, శుక్రవారం రాత్రి అల్లు అర్జున్ మంజీర బ్యారక్‌లో ఉండనున్నాడు. దీంతో అల్లు అర్జున్ విడుదలలో ఎందుకు జాప్యం జరుగుతుంది అనే అనుమానాలు అభిమానుల్లో వ్యక్తం అవుతున్నాయి.

Exit mobile version