ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ప్రస్తుతం పాన్ ఇండియా మూవీ ‘పుష్ప-2’ లో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాను స్టార్ డైరెక్టర్ సుకుమార్ తెరకెక్కిస్తుండటంతో అంచనాలు పీక్స్ లో నెలకొన్నాయి. ఇక ఈ సినిమాను డిసెంబర్ 6న రిలీజ్ చేస్తున్నట్లు మేకర్స్ ఇప్పటికే క్లారిటీ ఇచ్చారు. అయితే, బన్నీ నెక్ట్స్ ప్రాజెక్ట్ పై గతకొద్ది రోజులుగా పలు రకాల వార్తలు వినిపిస్తున్నాయి. ఈ క్రమంలో ప్రముఖ నిర్మాత బన్నీ వాస్ ఈ విషయంపై తాజాగా ఓ క్లారిటీ ఇచ్చారు.
బన్నీ, త్రివిక్రమ్ కాంబినేషన్ లో ఓ సినిమా రాబోతుందనే వార్తలపై ఆయన స్పందించారు. త్రివిక్రమ్ తో బన్నీ మూవీ ఖచ్చితంగా ఉంటుందని.. ఇదొక భారీ బడ్జెట్ సినిమా అని.. దీన్ని సినిమా కంటే కాన్సెప్ట్ అనడం బెటర్ అని బన్నీ వాస్ అన్నారు. త్వరలోనే ఈ ప్రాజెక్ట్ కి సంబంధించిన అనౌన్స్ మెంట్ ఉంటుందని ఆయన తెలిపారు.
దీంతో, అల్లు అర్జున్-త్రివిక్రమ్ కాంబినేషన్ లో సినిమాపై క్లారిటీ వచ్చినట్లు అయ్యింది. ఇక ఈ సినిమాను ఇండియాలోనే అత్యంత భారీ బడ్జెట్ తో ప్రొడ్యూస్ చేయనున్నట్లు తెలుస్తోంది. మరి ఈ సినిమాకు సంబంధించిన అఫీషియల్ అనౌన్స్ మెంట్ ఎప్పుడు వస్తుందో చూడాలి.