వైరల్ వీడియో : గణేష్ నిమజ్జనోత్సవంలో కూతురు అర్హ తో అల్లు అర్జున్

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తన లేటెస్ట్ మూవీ పుష్ప ది రూల్ త్వరలో పట్టాలెక్కనుంది. సుకుమార్ తీయనున్న ఈ ప్రతిష్టాత్మక పాన్ ఇండియా మూవీలో రష్మిక హీరోయిన్ గా నటిస్తుండగా మైత్రి మూవీ మేకర్స్ వారు నిర్మిస్తున్నారు. వేగంగా ఈ మూవీ షూట్ పూర్తి చేసి వచ్చే ఏడాది చివర్లో దీనిని థియేటర్స్ లోకి తీసుకువచ్చేందుకు యూనిట్ సన్నాహాలు చేస్తోంది.

ఇక విషయం ఏమిటంటే ఇటీవల తన ఫ్యామిలీతో కలిసి విదేశాలకు వెళ్లి హాలిడే ఎంజాయ్ చేసిన వచ్చిన ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, లేటెస్ట్ గా తమ గీతా ఆర్ట్స్ సంస్థలో నెలకొల్పిన వినాయకుడి నిమజ్జనోత్సవానికి స్టాఫ్ తో పాటు కూతురు అర్హ ని తీసుకుని నేడు ఊరేగింపుగా వెళ్లారు. ఈ సందర్భంగా దారి పొడవునా అల్లు అర్జున్ ఫ్యాన్స్ సందడి చేస్తూ ఆయన వాహనాన్ని అనుసరించారు. కాగా ఈ ఊరేగింపు తాలూకు వీడీయో ప్రస్తుతం నెట్ లో తెగ వైరల్ అవుతోంది. మరి ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా దానిపై ఒక లుక్ వేసేయండి.

Exit mobile version