అల్లు అర్జున్ కుమారుడు అల్లు అయాన్ ఒక సర్ప్రైజ్ వీడియో తో అల్లు అర్జున్ అభిమానులను విశేషంగా ఆకట్టుకుంటున్నాడు. వరుణ్ తేజ్ హీరోగా కిరణ్ కొర్రపాటి దర్శకత్వం లో తెరకెక్కుతున్న తాజా చిత్రం గని. స్పోర్ట్స్ డ్రామా గా తెరకెక్కుతున్న ఈ చిత్రం పై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ చిత్రం నుండి ఇటీవల గని ఆంతెం విడుదల అయిన సంగతి అందరికీ తెలిసిందే. ఈ పాట కి ప్రేక్షకుల నుండి, అభిమానుల నుండి ఆదరణ వస్తోంది.
ఈ పాట కి అల్లు అయాన్ చేసిన వర్కౌట్స్ ను జోడిస్తూ చేసిన వీడియో ను గీతా ఆర్ట్స్ సోషల్ మీడియా లో పోస్ట్ చేయడం జరిగింది. ఇప్పుడు ఆ వీడియో సోషల్ మీడియా లో వైరల్ గా మారుతోంది. అల్లు అర్జున్ కుమారుడు ను చూసి, అదే ఎనర్జీ, అదే స్టైల్ అంటూ అభిమానులు, ప్రేక్షకులు కామెంట్స్ చేస్తున్నారు.
వరుణ్ తేజ్ హీరోగా నటిస్తున్న గని చిత్రం లో హీరోయిన్ గా సాయి మంజ్రేకర్ నటిస్తోంది. రెనైస్సన్స్ పిక్చర్స్ మరియు అల్లు బాబీ కంపనీ సంయుక్తం ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. జగపతి బాబు, ఉపేంద్ర, సునీల్ శెట్టి, నవీన్ చంద్ర తదితరులు కీలక పాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రానికి థమన్ సంగీతం అందిస్తున్నారు. ఈ చిత్రాన్ని డిసెంబర్ 3 వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేసేందుకు చిత్ర యూనిట్ సన్నాహాలు చేస్తుంది.
Here's the cute little video surprise featuring #AlluAyaan from @Bobbyallu & Team #Ghani????????#AlluAyaanForGhani ????
▶️ https://t.co/tSzQqmIjjY @IAmVarunTej @nimmaupendra @SunielVShetty @dir_kiran @saieemmanjrekar @MusicThaman @ramjowrites @george_dop @abburiravi @adityamusic pic.twitter.com/5iCSghYI4H
— Geetha Arts (@GeethaArts) November 8, 2021


