అల్లు శిరీష్ హీరోగా నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘బడ్డీ’ ఆగస్టు 2న థియేటర్లలోకి రానుంది. ఈ చిత్రంతో ఖచ్చితంగా హిట్ కొట్టాలని అల్లు శిరీష్ ప్రయత్నిస్తున్నాడు. తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ను చిత్ర యూనిట్ నిర్వహించింది. ఈ ఈవెంట్‌లో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, మెగాస్టార్ చిరంజీవిల గురించి హీరో అల్లు శిరీష్ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.
పవన్ కళ్యాణ్ నుంచి మెంటల్ స్ట్రెంగ్త్‌ను.. మెగాస్టార్ చిరంజీవి నుంచి అన్‌లిమిటెడ్ పాజిటివిటీలను నేర్చుకున్నట్లు శిరీష్ తెలిపారు. అంతేగాక, తన తండ్రి అల్లు అరవింద్ ఒక రోబో లాగా పని చేస్తారని అన్నారు. ఉదయం టీ తాగే సమయం నుండి రాత్రి వరకు తన షెడ్యూల్‌ను ఫాలో అవుతారంటూ చెప్పుకొచ్చారు. స్టూడియో గ్రీన్ పతాకంపై నిర్మించిన ‘బడ్డీ’ చిత్రానికి సామ్ ఆంటోన్ దర్శకత్వం వహించారు. ఈ చిత్రం అందరిలో మంచి అంచనాలను క్రియేట్ చేసింది.