యాక్ష‌న్ ఎలిమెంట్స్ తో ఆక‌ట్టుకుంటున్న‌ ‘బ‌డ్డీ’ ట్రైల‌ర్

యంగ్ హీరో అల్లు శిరీష్ న‌టిస్తున్న తాజా చిత్రం ‘బ‌డ్డీ’పై ప్రేక్ష‌కుల్లో మొద‌ట్నుండి మంచి అంచ‌నాలు క్రియేట్ అయ్యాయి. ఈ సినిమా పోస్ట‌ర్స్, టీజ‌ర్ అంచనాల‌ను రెట్టింపు చేశాయి. ఇక ఈ సినిమాను సామ్ ఆంటోన్ డైరెక్ట్ చేస్తుండ‌గా, పూర్తి యాక్ష‌న్ ఎంట‌ర్టైన‌ర్ మూవీగా ఇది రానుంది. తాజాగా ఈ సినిమా థియేట్రిక‌ల్ ట్రైల‌ర్ ను మేక‌ర్స్ రిలీజ్ చేశారు.

‘బ‌డ్డీ’ ట్రైల‌ర్ ఆద్యంతం యాక్ష‌న్ ఎలిమెంట్స్ తో ఆక‌ట్టుకుంటుంది. అన్యాయంపై తిర‌గ‌బ‌డ్డ ఒక టెడ్డీ బియ‌ర్ అంటూ ఈ ట్రైల‌ర్ మొద‌ల‌వ‌గా, ఇందులో ఓ టెడ్డీ బియ‌ర్ విల‌న్ల‌ను చిత‌క్కొడుతూ క‌నిపించింది. అయితే, ఈ టెడ్డీ బియ‌ర్ కు సాయం చేసే కెప్టెన్ పాత్ర‌లో అల్లు శిరీష్ కనిపించాడు. అజ్మ‌ల్ విల‌న్ పాత్ర‌లో న‌టిస్తున్న ఈ సినిమాలో యాక్ష‌న్ కు కొదువ లేకుండా డైరెక్ట‌ర్ దీన్ని తెర‌కెక్కించారు.

ఇక ఈ సినిమాకు హిప్ హాప్ త‌మిళ సంగీతం అందిస్తుండ‌గా, ఇప్పటికే రిలీజ్ అయిన సాంగ్స్ కు మంచి రెస్పాన్స్ ద‌క్కింది. ఈ సినిమాలో ప్రిషా రాజేష్ సింగ్, ముఖేష్ కుమార్, అలీ త‌దిత‌రులు ఇత‌ర ముఖ్య పాత్ర‌ల్లో న‌టిస్తున్నారు. ఈ సినిమాను జూలై 26న ప్ర‌పంచ‌వ్యాప్తంగా రిలీజ్ చేస్తున్న‌ట్లు మేక‌ర్స్ వెల్ల‌డించారు.

వీడియో కోసం ఇక్క‌డ క్లిక్ చేయండి

Exit mobile version