కొత్త సినిమాను స్టార్ట్ చేసిన అల్లు శిరీష్.. అది కూడ రీమేక్

Published on Nov 24, 2020 12:07 am IST

గతేడాది ‘ఏబిసిడి’ చిత్రంతో ప్రేక్షకుల్ని పలకరించాడు అల్లు శిరీష్. ఈ చిత్రం పర్వాలేదనే విజయాన్ని అందుకుంది. లాక్ డౌన్ మూలంగా ఇన్నాళ్లు కొత్త సినిమాను స్టార్ట్ చేయని ఆయన తాజాగా నూతన చిత్రాన్ని మొదలుపెట్టారు. ఈ చిత్రం ఒక రీమేక్. తమిళంలో మంచి విజయాన్ని అందుకున్న ‘ప్యార్ ప్రేమ కాదల్’ చిత్రాన్నే రీమేక్ చేస్తున్నారు. ఒరిజినల్ చిత్రాన్ని ఎలన్ డైరెక్ట్ చేయగా తెలుగు రీమేక్ ను రాకేశ్ శశి తెరకెక్కిస్తున్నారు.

ఒరిజినల్ వెర్షన్లో హరీశ్ కళ్యాణ్ హీరోగా నటించగా రైజా విల్సన్ కథానాయకిగా చేసింది. ఇక తెలుగు రీమేక్లో శిరీష్ సరసన ఎవరు నటిస్తున్నారో ఇంకా తెలియాల్సి ఉంది. ఈ చిత్రం పూర్తిస్థాయి రొమాంటిక్ కామెడీ ఎంటెర్టైనర్ గా ఉండనుంది. హైదరాబాద్లో ఈరోజే రెగ్యులర్ షూట్ మొదలైంది. గతంలో శిరీష్ చేసిన రొమాంటిక్ ఎంటర్టైనర్ ‘శ్రీరస్తు శుభమస్తు’ మంచి విజయాన్ని అందుకుంది. మళ్లీ అలాంటి విజయాన్నే రిపీట్ చేయాలని చూస్తున్నారు శిరీష్.

సంబంధిత సమాచారం :

More