అల్లు శిరీష్ ప్రధాన పాత్రలో, సామ్ ఆంటోన్ దర్శకత్వం లో తెరకెక్కుతున్న చిత్రం బడ్డీ. ఈ చిత్రం ను అనౌన్స్ చేసి చాలా నెలలు అవుతోంది. చిత్రం నుండి మేకర్స్ ఎలాంటి అప్డేట్ ను ఇంతకాలం వెల్లడించలేదు. దాదాపు ఏడాది తర్వాత ఇప్పుడు మళ్లీ ఈ సినిమా వార్తల్లో నిలిచింది. ఈ సినిమా ఫస్ట్ సింగిల్ ఆ పిల్ల కనులే రేపు ఉదయం 10 గంటలకు విడుదల చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు.
ఈ చిత్రం తమిళ నటుడు ఆర్య యొక్క టెడ్డీకి అధికారిక రీమేక్. స్టూడియో గ్రీన్ ఫిలింస్ ప్రైవేట్ లిమిటెడ్ పతాకంపై కె.ఇ జ్ఞానవేల్రాజా, ఆధాన జ్ఞానవేల్రాజా ఈ బడ్డీని నిర్మిస్తున్నారు. గాయత్రి భరద్వాజ్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ చిత్రంలో అజ్మల్ అమీర్, ప్రిషా రాజేష్ సింగ్, ముఖేష్ కుమార్, మహమ్మద్ అలీ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్రం కి సంబందించిన మరిన్ని వివరాలు త్వరలో వెల్లడి కానున్నాయి.