అప్పుడే ప్రీసేల్స్ లో “దేవర” మాస్ బ్యాటింగ్ షురూ.!

అప్పుడే ప్రీసేల్స్ లో “దేవర” మాస్ బ్యాటింగ్ షురూ.!

Published on Aug 31, 2024 9:00 AM IST

పాన్ ఇండియా మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ హీరోగా జాన్వీ కపూర్ హీరోయిన్ గా సాయి అలీఖాన్ విలన్ గా దర్శకుడు కొరటాల శివ తెరకెక్కిస్తున్న భారీ పాన్ ఇండియా అవైటెడ్ చిత్రం “దేవర” కోసం అందరికీ తెలిసిందే. మరి ఈ చిత్రం కోసం అభిమానులు ఓ రేంజ్ లో ఎదురు చూస్తుండగా ఇప్పుడు సినిమా రిలీజ్ దగ్గరకి వస్తుంది. అయితే ఈ చిత్రం అప్పుడే భారీ బుకింగ్స్ ని యూఎస్ మార్కెట్ లో నమోదు చేస్తున్నట్టుగా తెలుస్తుంది.

అక్కడ కొన్ని ప్రాంతాల్లో బుకింగ్స్ ని ఓపెన్ చేయగా ఆల్రెడీ 70 వేలకి పైగా డాలర్స్ మార్క్ ని ఈ చిత్రం క్రాస్ చేయడం విశేషం. దాదాపు నెల దగ్గర టైం ఉన్నప్పటికీ ముందే ఈ రేంజ్ బ్యాటింగ్ అంటే దేవర పట్ల అభిమానుల్లో ఉన్న ఆసక్తి ఏ లెవెల్లో ఉందో అర్ధం చేసుకోవచ్చు. ఇక ఈ చిత్రానికి అనిరుద్ సంగీతం అందిస్తుండగా ఎన్టీఆర్ ఆర్ట్స్, యువసుధ ఆర్ట్స్ వారు నిర్మాణం వహిస్తున్నారు అలాగే ఈ సెప్టెంబర్ 27న సినిమా రిలీజ్ కాబోతుంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు