నటి, డాన్సర్, యానిమల్ లవర్ అన్నిటికీ మించి అక్కినేని నాగార్జున భార్య అయిన అక్కినేని అమల బహుముఖ ప్రజ్ఞా శాలి. ఎనభై మరియు తొంభై లలో ఆమె తెలుగు,తమిళం, కన్నడ, హిందీ, మలయాళ భాషలలో నటించడం జరిగింది. ఇప్పటికీ తెలుగు మరియు హిందీ భాషలలో నటిస్తున్న అమల దాదాపు 28ఏళ్ల తరువాత ఒక తమిళ చిత్రంలో నటిస్తున్నారు. 1991 విడుదలైన కర్పూర ముల్లై చిత్రం తరువాత అమల తమిళంలో నటించింది లేదు. కానీ ఇంత కాలం తరువాత శర్వానంద్, రీతూ వర్మ జంటగా తెరకెక్కుతున్న చిత్రంలో ఆమె నటిస్తున్నారు.
డ్రీం వారియర్స్ పతాకంపై శ్రీకార్తిక్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రం తెలుగు మరియు తమిళ భాషలలో ఏక కాలంలో తెరకెక్కుతుంది. ఇటీవలే ఈ మూవీ రెగ్యులర్ షూటింగ్ మొదలైంది. 2012లో లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ చిత్రంతో తెలుగులో సెకండ్ ఇన్నింగ్స్ మొదలుపెట్టిన అమల 2018లో మనం చిత్రంలో కూడా నటించారు.