సమీక్ష : అమరం అఖిలం ప్రేమ – తెలుగు చిత్రం “ఆహా”లో ప్రసారం

సమీక్ష : అమరం అఖిలం ప్రేమ – తెలుగు చిత్రం “ఆహా”లో ప్రసారం

Published on Sep 18, 2020 2:02 PM IST
V Movie Review

విడుదల తేదీ : సెప్టెంబర్ 18, 2020

123telugu.com Rating : 2.75/5

నటీనటులు : శ్రీకాంత్ అయ్యంగర్,విజయ్ రామ్, శివ్ శక్తి సచ్‌దేవ్, కేశవ్ దీపక్

దర్శకత్వం : జోనాథన్ వెసపోగు

నిర్మాత : ప్రసాద్

సంగీతం : రాధన్

సినిమాటోగ్రఫర్ : రసూల్ ఎల్లోర్

 

ఈ లాక్ డౌన్ సమయంలో పలు చిత్రాలు మరియు సిరీస్ ల రివ్యూస్ తో కొనసాగిస్తున్న క్రమంలో నేడు మేము ఎంచుకున్న చిత్రం “అమరం అఖిలం ప్రేమ”. ఈ చిత్రం మన తెలుగు స్ట్రీమింగ్ యాప్ “ఆహా” ద్వారా డైరెక్ట్ డిజిటల్ స్ట్రీమింగ్ కు అందుబాటులోకి వచ్చింది. మరి ఈ చిత్రం ఎలా ఉందో ఇపుడు సమీక్షలో తెలుసుకుందాం రండి.

 

కథ :

 

అఖిల(శివ్ శక్తి సచ్ దేవ్) తన చిన్నప్పటి నుంచి తన తండ్రి(శ్రీకాంత్ అయ్యంగర్) అంటే అపారమైన ప్రేమను కలిగి ఉంటుంది. అలాగే అతనికి కూడా తన కూతురు అంటే ప్రాణం..అలా ఈ ఇద్దరు ఒకరినొకరు విడిచిపెట్టలేనంత ప్రేమతో ఉంటారు. కానీ అఖిల వల్ల జరిగిన ఒక పెద్ద తప్పు మూలాన ఈ ఇద్దరు తండ్రి కూతుర్ల నడుమ చాలా దూరాన్ని పెంచేస్తుంది. ఆ తర్వాత అఖిల ఐఏఎస్ కోచింగ్ కోసం హైదరాబాద్ వచ్చేస్తుంది. అక్కడ అమర్(విజయ్ రామ్) పరిచయం అయిన విజయ్ ఆమెను ప్రేమిస్తాడు. ముందు అఖిల నో చెప్పినప్పటికీ తర్వాత అతనంటే ఇష్టపడుతుంది. మరి ఈ ఇద్దరి లవ్ ట్రాక్ ఏమవుతుంది? అఖిల మళ్ళీ తన తండ్రిని కలుసుకుందా? అసలు ఆమె చేసిన ఆ తప్పేంటి అన్నవే అసలు కథ.

 

ప్లస్ పాయింట్స్ :

 

ఈ చిత్రంలో అన్నిటికన్నా ప్రధాన పాత్ర పోషించింది పాత్రల తాలూకా ఎమోషన్స్ అని చెప్పాలి. కథానుసారం వచ్చే బలమైన ఎమోషన్స్ సినిమా ఎండింగ్ వరకు కూడా చాలా డీసెంట్ గా ఉంటాయి. అంతే కాకుండా ఈ చిత్రంలో డైలాగ్స్ కూడా చాలా లోతైన భావంతో ఆలోచింపదగ్గేలా అనిపిస్తాయి. అంతే కాకుండా ఈ చిత్రాన్ని ముగించిన విధానం కూడా ప్రతీ ఒక్క పాత్రకు మంచి ముగింపు ఇచ్చేలా న్యాయం చేకూరుస్తుంది.

ఇక మేజర్ హైలైట్ ఏమిటంటే నటుడు శ్రీకాంత్ అయ్యంగర్ అని చెప్పాలి. ఈ మధ్య కాలంలో శ్రీకాంత్ అయ్యంగర్ చేసిన రోల్స్ అన్నీ సాలిడ్ పెర్ఫామెన్స్ ఉన్నవే.. అందుకు తగ్గట్టు గానే ఆయన కూడా మంచి నటనను అతను కనబరుస్తున్నారు. అలాగే ఈ చిత్రంలో ఆ డెప్త్ ను మైంటైన్ చేస్తూ చాలా మంచి అవుట్ ఫుట్ ఇచ్చారు. సినిమాలో చాలా వరకు కనిపించకపోయినప్పటికీ ఒక పదిహేను నిమిషాల పతాక సన్నివేశంలో అద్భుతంగా నటించారు.

ఇక హీరో హీరోయిన్స్ విషయానికి వస్తే లుక్స్ పరంగా విజయ్ ఒకే అని చెప్పొచ్చు. పెర్ఫామెన్స్ పరంగా కూడా మంచి నటనను కనబరిచారు. కానీ హిందీ టీవీ నటి శివ్ శక్తి సచ్ దేవ్ అమేజింగ్ పెర్ఫామెన్స్ ను కనబరిచింది. ఓ కూతురిగా ఎమోషన్స్ పండిస్తూనే భిన్నమైన తన రోల్ కు అద్భుతంగా రక్తి కట్టించింది. ఎమోషన్స్, అందం, అభినయం కూడిన నటన ఖచ్చితంగా మన టాలీవుడ్ లో మంచి భవిష్యత్తు కల్పించొచ్చు.

 

మైనస్ పాయింట్స్ :

 

ఈ చిత్రం మొదటి అరగంట ఏమాత్రం గొప్పగా అనిపించదు కొన్ని సన్నివేస్లు ఓకె కానీ మిగతా చాలా సీన్స్ అన్నీ ఎక్కడో చూసేసినట్టే అనిపిస్తాయి. అలాగే హీరో హీరోయిన్స్ మధ్య లవ్ ట్రాక్ కూడా పరమ రొటీన్ గా ఉంటుంది.

అలాగే తండ్రి కూతుర్ల మధ్య కొన్ని సన్నివేశాలు మరీ సాగదీసినట్టుగా అనిపిస్తుంది. పైగా ఈ సినిమా అసలు కథలోకి మొదలు కావడానికి మాత్రం ఇంటర్వెల్ వరకు ఓపిక పట్టక తప్పదు. అలాగే సినిమాలోని నాటకీయతను మరింత ఎఫెక్టీవ్ గా చూపించి ఉంటే బాగుండేది.

 

సాంకేతిక విభాగం :

 

ఈ చిత్రం తాలుకా నిర్మాణ విలువలు కానీ చూపించిన విజువల్స్ కానీ చాలా నీట్ గా బాగుంటాయి. కానీ ఎడిటింగ్ వర్క్ మాత్రం ఏమంత బాలేదు. సినిమా ఆరంభంలో ఒక 15 నిముషాలు కొన్ని ఇతర అనవసర సన్నివేశాలు కట్ చేసి ఉంటే చిత్రం మరింత ప్రభావితంగా ఉండేది.

అలాగే సాహిత్యం కానీ రాధన్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ కానీ సంగీత ప్రియులను ఆకట్టుకుంటాయి. ఇక దర్శకుని పనితనంకు వచ్చినట్టయితే వెసపోగు మంచి ప్రతిభను కనబరచారు మొదటి అరగంట సేపు సినిమాను పక్కన పెడితే మిగతా చిత్రాన్ని బాగా హ్యాండిల్ చేసారు. ఎమోషన్స్ కానీ కథనం కానీ చాలా గ్రిప్పింగ్ గా చూపించారు. అవి మరిన్ని మంచి విజువల్స్ చూపించాయి.

 

తీర్పు :

 

ఇక మొత్తంగా చూసుకుంటే ఈ అమరం అఖిలం ప్రేమ అనే చిత్రం ఒక ఎమోషనల్ ఫ్యామిలీ డ్రామా అని చెప్పొచ్చు. ఓ సింపుల్ అండ్ రొమాంటిక్ బ్యాక్ డ్రాప్ తో బలమైన ఎమోషన్స్ నటీనటుల పెర్ఫామెన్స్ లు, సెకండాఫ్ కానీ ఎండింగ్ కానీ ఈ చిత్రానికి మంచి హైలైట్ గా నిలుస్తాయి. కానీ కొన్ని తెలిసినవే పరమ రొటీన్ ట్రాక్స్ ఉండడం కొన్ని సీన్స్ ఊహించేయగలగడం వంటివి నిరాశ పరుస్తాయి. జస్ట్ ఈ మైనర్ మైనస్ అంశాలను పక్కన పెడితే కనుక ఈ చిత్రాన్ని కుటుంబసమేతంగా ఒకసారి ఖచ్చితంగా చూడొచ్చు.

123telugu.com Rating : 2.75/5
Reviewed by 123telugu Team

Click Here For English Review

సంబంధిత సమాచారం

తాజా వార్తలు