ఇదొక రియల్ హీరో స్టోరీ – శివ కార్తికేయన్

తమిళ హీరో శివ కార్తికేయన్ హీరోగా రాజ్‌కుమార్ పెరియసామి దర్శకత్వంలో వస్తున్న బయోగ్రాఫికల్ యాక్షన్ మూవీ ‘అమరన్’. ఈ సినిమాలో సాయి పల్లవి ఫిమేల్ లీడ్ గా నటిస్తున్నారు. ఈ సినిమా దీపావళికి అక్టోబర్ 31న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ సందర్భంగా మేకర్స్ ప్రీరిలీజ్ ఈవెంట్ ను నిర్వహించారు. ప్రీరిలీజ్ ఈవెంట్ లో శివ కార్తికేయన్ మాట్లాడుతూ.. ‘అందరికీ నమస్కారం. మీ అందరి ప్రేమకి థాంక్యూ. మిమ్మల్ని మళ్ళీ ఇలా మీట్ అవ్వడం చాలా హ్యాపీగా ఉంది’ అని శివ కార్తికేయన్ మాట్లాడారు.

శివ కార్తికేయన్ ఇంకా మాట్లాడుతూ.. ‘ఇదొక రియల్ హీరో స్టోరీ. మేజర్ ముకుంద్ వరదరాజన్, ఇందు రెబెకా ట్రూ స్టోరీ. అమరన్ ఒక సోల్జర్.. లవ్ డ్యూటీ ఫ్యామిలీ ఎలా ఉంటుందో డైరెక్టర్ రాజకుమార్ అద్భుతంగా చూపించారు. ఈ సినిమాలో నేను మేజర్ ముకుంద్ రోల్ చేశాను. ఈ సినిమాను తెలుగులో రిలీజ్ చేస్తున్న సుధాకర్ రెడ్డి గారికి థాంక్యూ సో మచ్. లవ్ యు ఆల్’ అని శివ కార్తికేయన్ తెలిపారు. అన్నట్టు ఈ చిత్రాన్ని ఉలగనాయగన్ కమల్ హాసన్, R. మహేంద్రన్, సోనీ పిక్చర్స్ ఇంటర్నేషనల్ ప్రొడక్షన్స్, గాడ్ బ్లెస్ ఎంటర్‌టైన్‌మెంట్‌తో కలిసి నిర్మిస్తున్నారు.

Exit mobile version