సమీక్ష : అమరన్ – ట్రూ ఎమోషన్స్ తో సాగే డీసెంట్ ఆర్మీ డ్రామా !

సమీక్ష : అమరన్ – ట్రూ ఎమోషన్స్ తో సాగే డీసెంట్ ఆర్మీ డ్రామా !

Published on Oct 31, 2024 4:03 PM IST
Amaran Movie Review in Telugu

విడుదల తేదీ : అక్టోబర్ 31, 2024

123తెలుగు.కామ్ రేటింగ్ : 3.25/5

నటీనటులు : శివ కార్తీకేయన్, సాయిపల్లవి, భువన్ అరోరా, రాహుల్ బోస్, లల్లూ తదితరులు.

దర్శకుడు : రాజ్‌కుమార్‌ పెరియసామి

నిర్మాతలు : ఉలగనాయగన్ కమల్ హాసన్, ఆర్. మహేంద్రన్

సంగీత దర్శకుడు : జీవీ ప్రకాష్ కుమార్

సినిమాటోగ్రఫీ : సి.హెచ్. సాయి

సంబంధిత లింక్స్: ట్రైలర్

తమిళ హీరో శివ కార్తికేయన్ నటించిన బయోపిక్ ‘అమరన్’. ఈ సినిమా మేజర్ ముకుంద్ వరదరాజన్ జీవితకథ ఆధారంగా తెరకెక్కింది. రాజ్ కుమార్ పెరియస్వామి డైరెక్ట్ చేసిన ఈ సినిమా ఈ రోజు థియేటర్లలో విడుదలైంది. ఈ చిత్రం ఎలా ఉందో సమీక్ష లోకి వెళ్ళి చూద్దాం.

 

కథ :

మేజర్ ముకుంద్ వరదరాజన్ దేశానికి చేసిన ఎనలేని సేవను, అలాగే దేశ భద్రత కోసం ఆర్మీలో ఎలాంటి ఆపరేషన్ చేశాడు అనే కోణంలో ఈ కథ సాగింది. ముకుంద్ వరదరాజన్ (శివ కార్తికేయన్)కి చిన్న తనం నుంచి ఆర్మీ ఆఫీసర్ కావాలని కల ఉంటుంది. ఫ్యామిలీకి ఇష్టం లేకపోయినా ముకుంద్ వరదరాజన్ ఆర్మీకి వెళ్తాడు. ఈ మధ్యలో ముకుంద్ వరదరాజన్ జీవితంలోకి ఇందు రెబెక్కా వర్గీస్‌ ( సాయి పల్లవి) వస్తోంది. కాలేజీ రోజుల నుంచి వీరిద్దరూ ప్రేమలో పడతారు. ఈ క్రమంలో ముకుంద్ వరదరాజన్ ఆర్మీకి వెళ్ళాక, అతని జీవితంలో చోటు చేసుకున్న సంఘటనలు ఏమిటి ?, ఇందుతో అతని లైఫ్ ఎలా సాగింది ?, చివరకు దేశం కోసం ముకుంద్ వరదరాజన్ ఏం త్యాగం చేశాడు ? అనేది మిగిలిన కథ.

 

ప్లస్ పాయింట్స్ :

అమరన్.. ఈ పేరుకు తగ్గట్టుగానే ఈ సినిమాలో కూడా అంతే ఎమోషన్ ఉంది. అంతే త్యాగం ఉంది. శివ కార్తికేయన్ తన గత చిత్రాల కంటే భిన్నంగా ఈ ఎమోషనల్ రియలిస్టిక్ బయోగ్రఫీ సాగింది. ఇక ఈ సినిమాలో శివ కార్తికేయన్ తన లుక్స్ లో అండ్ యాక్షన్ లో ఫ్రెష్ నెస్ చూపించడానికి చేసిన ప్రయత్నం చాలా బాగుంది. ముఖ్యంగా ఆర్మీ ఆఫీసర్ గా, మేజర్ గా శివ కార్తికేయన్ నటన సినిమాకే హైలెట్ గా నిలుస్తుంది. సాయి పల్లవితో నడిచే ప్రేమ సన్నివేశాలు మరియు వారి మధ్య కెమిస్ట్రీ కూడా చాలా బాగా ఆకట్టుకుంటుంది.

దర్శకుడు రాజ్ కుమార్ పెరియస్వామి రాసుకున్న మెయిన్ స్టోరీ, ట్రీట్మెంట్, కొన్ని ఎమోషనల్ సన్నివేశాలు చాలా బాగున్నాయి. ముఖ్యంగా సాయి పల్లవికి శివ కార్తికేయన్ కి మధ్య సాగే ఎమోషనల్ సన్నివేశాలు చాలా బాగున్నాయి. సాయి పల్లవి తన నటనతో మెప్పించింది. ఇందు పాత్ర రూపంలో ఆమెకు మరో మంచి పాత్ర దొరికింది. భువన్ అరోరా – సి, రాహుల్ బోస్, లల్లూ, శ్రీకుమార్ తమ పాత్రలకు పూర్తి న్యాయం చేశారు. అలాగే మిగిలిన నటీనటులు కూడా తమ పాత్రలకు న్యాయం చేశారు.

ఈ ‘అమరన్’ కథలో ‘ఆర్మీ ఆఫీసర్స్ కి – వారి ఫ్యామిలీస్’కి మధ్య ఉండే ఎమోషన్స్ ను చూపించిన విధానం చాలా ఆలోచనాత్మకంగా ఉంది. అదే విధంగా జీవీ ప్రకాష్ కుమార్ సంగీతం కూడా ఆకట్టుకుంది. దర్శకుడు క్లైమాక్స్ ను కూడా వండర్ ఫుల్ గా డిజైన్‌ చేశారు. మొత్తానికి గుడ్ ఎమోషన్స్ తో పాటు ఆర్మీ నేపథ్యాన్ని, ప్రతి ఆర్మీ పాత్రను దర్శకుడు చాలా బాగా తీర్చిదిద్దారు.

 

మైనస్ పాయింట్స్ :

‘అమరన్’ కథా నేపథ్యంలో డెప్త్, అలాగే అంతకు మించిన ఎమోషన్ ఉన్నా.. ఫస్ట్ హాఫ్ లో కొన్ని సన్నివేశాలు స్లాగా సాగుతాయి. నిజానికి ప్రధాన కథాంశంతో పాటు ప్రధాన పాత్రలు, వాటి చిత్రీకరణ చాలా బాగున్నప్పటికీ.. కథనం మాత్రం ఒకటి రెండు సన్నివేశాల్లో స్లోగా సాగుతుంది. ముఖ్యంగా సెకండ్ హాఫ్ స్టార్టింగ్ సీన్స్ ను ఇంకా ఇంట్రెస్ట్ గా బిల్డ్ చేసి ఉంటే బాగుండేది.

 

సాంకేతిక విభాగం :

టెక్నికల్ గా చూసుకుంటే సినిమాలో సాంకేతిక విభాగం వర్క్ చాలా బాగుంది. జీవీ ప్రకాష్ కుమార్ సంగీతం సినిమాకు ప్లస్ అయ్యింది. అదే విధంగా సి.హెచ్. సాయి సినిమాటోగ్రఫీ సినిమాకే హైలెట్ గా నిలుస్తుంది. కొన్ని కీలక సన్నివేశాల్లో కెమెరామెన్ పనితనం చాలా బాగుంది. ఎడిటర్ ఆర్. కలైవానన్ ఎడిటింగ్ బాగుంది. సినిమాలోని నిర్మాతలు ఉలగనాయగన్ కమల్ హాసన్, ఆర్. మహేంద్రన్ పాటించిన ప్రొడక్షన్ వాల్యూస్ అద్భుతంగా ఉన్నాయి. దర్శకుడు రాజ్‌కుమార్‌ పెరియసామి తన రచనతోనూ దర్శకత్వంతోనూ ఆకట్టుకున్నారు.

 

తీర్పు :

‘అమరన్’ అంటూ వచ్చిన ఈ బయోగ్రఫీ ఎమోషనల్ డ్రామాలో.. శివ కార్తీకేయన్ నటన, ఆర్మీ నేపథ్యంలో వచ్చే సన్నివేశాలు, దేశభక్తికి సంబంధించిన మెయిన్ ప్లాట్, మరియు ఫ్యామిలీ సెంటిమెంట్, అలాగే, యాక్షన్ సీన్స్ అండ్ శివ కార్తీకేయన్ – సాయి పల్లవి పాత్రల తాలూకు ఎమోషన్స్ చాలా బాగున్నాయి. క్లైమాక్స్ కూడా చాలా బాగా ఆకట్టుకుంది. ఐతే, కొన్ని సీన్స్ మాత్రం రెగ్యులర్ గా సాగాయి. ఓవరాల్ గా ఈ సినిమా ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటుంది.

123telugu.com Rating: 3.25/5

Reviewed by 123telugu Team

Click Here For English Review

సంబంధిత సమాచారం

తాజా వార్తలు