‘అమరన్’ తెలుగు ప్రమోషన్స్‌కి టైమ్ ఫిక్స్.. ఎప్పుడంటే?

‘అమరన్’ తెలుగు ప్రమోషన్స్‌కి టైమ్ ఫిక్స్.. ఎప్పుడంటే?

Published on Oct 25, 2024 4:13 PM IST

తమిళ హీరో శివ కార్తికేయన్ నటిస్తున్న బయోపిక్ మూవీ ‘అమరన్’ దీపావళి కానుకగా గ్రాండ్ రిలీజ్‌కి రెడీ అయ్యింది. ఈ సినిమాను మేజర్ ముకుంద్ వరదరాజన్ జీవితకథ ఆధారంగా తెరకెక్కుతోంది. ఈ సినిమాను దర్శకుడు రాజ్ కుమార్ పెరియ స్వామి డైరెక్ట్ చేస్తుండగా ఈ సినిమాను తెలుగులోనూ భారీ స్థాయిలో రిలీజ్ చేసేందుకు మేకర్స్ రెడీ అవుతున్నారు.

ఇక ఈ సినిమాను తెలుగులో ప్రమోట్ చేసేందుకు చిత్ర యూనిట్ రెడీ అయ్యింది. ఈ సినిమాలో అందాల భామ సాయి పల్లవి హీరోయిన్‌గా నటిస్తుండటంతో ఆమెకు తెలుగులో ఎక్కువ ఫాలోయింగ్ ఉందని మేకర్స్ భావిస్తున్నారు. దీంతో ఈ చిత్రానికి సంబంధించిన ఓ గ్రాండ్ ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ని అక్టోబర్ 26న సాయంత్రం 6 గంటల నుండి హైదరాబాద్‌లోని ఐటిసి కోహినూర్‌లో నిర్వహించేందుకు సిద్ధమవుతున్నారు.

జీవీ.ప్రకాశ్ కుమార్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాను తెలుగులో హీరో నితిన్ హోం బ్యానర్ శ్రేష్ఠ్ మూవీస్ రిలీజ్ చేస్తోంది. దీంతో ఈ సినిమాకు తెలుగులో ఎలాంటి రెస్పాన్స్ లభిస్తుందా అని అందరూ ఆసక్తిగా చూస్తున్నారు. అక్టోబర్ 31న ఈ సినిమాను గ్రాండ్ రిలీజ్ చేసేందుకు మేకర్స్ రెడీ అవుతున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు