డే 2 మరింత బెటర్ వసూళ్లతో “అంబాజీపేట మ్యారేజీ బ్యాండు”

టాలెంటెడ్ నటుడు సుహాస్ హీరోగా కొత్త హీరోయిన్ శివాని నాగారం టాలీవుడ్ కి పరిచయం అవుతూ దర్శకుడు దుశ్యంత్ తెరకెక్కించిన హార్డ్ హిట్టింగ్ ఎమోషనల్ డ్రామా “అంబాజీపేట మ్యారేజీ బ్యాండు”. మరి డీసెంట్ ప్రమోషన్స్ నడుమ వచ్చిన ఈ చిత్రం సాలిడ్ వసూళ్లు అందుకొని మొదటి రోజే అదరగొట్టింది.

అంతే కాకుండా ప్రీమియర్స్ తోనే సాలిడ్ రెస్పాన్స్ అందుకుంది. ఇక రెండో రోజు కూడా మంచి వసూళ్ళని ఈ చిత్రం అందుకుంటుంది అని ట్రేడ్ లో టాక్ వచ్చింది. ఇప్పుడు అనుకున్నట్టుగానే డే 2 మరింత ఎక్కువ వసూళ్లు ఈ చిత్రానికి నమోదు అయ్యాయి.

అయితే ఈ చిత్రానికి మొదటి రోజు 2.28 కోట్ల గ్రాస్ ని అందుకోగా ఇప్పుడు రెండో రోజు 2.88 కోట్ల గ్రాస్ ని అందుకుంది. దీనితో రెండు రోజుల్లో ఈ చిత్రం 5.16 కోట్ల గ్రాస్ ని అందుకొని అదరగొట్టింది. ఇక ఈ ఆదివారం వసూళ్లు కూడా మంచి స్ట్రాంగ్ గా ఉంటాయి. ఇవెలా ఉంటాయో చూడాల్సిందే.

Exit mobile version