కల్కి చిత్రంలో నటించడం ఎప్పటికీ మరచిపోలేని అద్భుతమైన అనుభవం – అమితాబ్ బచ్చన్

కల్కి చిత్రంలో నటించడం ఎప్పటికీ మరచిపోలేని అద్భుతమైన అనుభవం – అమితాబ్ బచ్చన్

Published on Jun 19, 2024 10:35 PM IST

పాన్ ఇండియన్ బిగ్గీ కల్కి 2898 AD ప్రీ రిలీజ్ ఈవెంట్ ఈ రోజు సాయంత్రం ముంబైలో జరిగింది. ప్రధాన నటులు ప్రభాస్, కమల్ హాసన్, అమితాబ్ బచ్చన్ మరియు దీపికా పదుకునే ఈ కార్యక్రమంకి హాజరయ్యారు. ప్రముఖ నటుడు రానా దగ్గుబాటి హోస్ట్‌గా వ్యవహరించారు. స్క్రిప్ట్ విన్న తర్వాత అమితాబ్‌కు ఎలా అనిపించిందని రానా అడిగాడు.

అమితాబ్ బచ్చన్ మాట్లాడుతూ, నాగి వచ్చి 2898 AD నాటి కల్కి ఆలోచనను వివరించాడు. అతను వెళ్లిపోయిన తర్వాత, నాగి ఏం తాగుతాడు అని నేను అనుకున్నాను. ఇలాంటివి ఆలోచించడం అతిశయోక్తి అన్నట్లు మాట్లాడారు. మీరు ఇప్పుడే చూసిన కొన్ని విజువల్స్ నమ్మశక్యం కానివి. ఎవరైనా ఇలా భవిష్యత్‌తో కూడిన ప్రాజెక్ట్‌ను కలిగి ఉండటం చాలా అద్భుతం అని అన్నారు. కల్కి 2898AD కోసం పని చేయడం నేను ఎప్పటికీ మరచిపోలేని అద్భుతమైన అనుభవం అని అన్నారు. ఈ చిత్రం జూన్ 27న పలు భాషల్లో గ్రాండ్ గా రిలీజ్ కానుంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు