అమితాబ్ విషయంలో నాగ్ అశ్విన్ టాలెంట్ కి ఫ్యాన్స్ ఫిదా!

రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా, టాలెంటెడ్ డైరెక్టర్ నాగ్ అశ్విన్ దర్శకత్వంలో తెరకెక్కిన మైథాలజీ సైన్స్ ఫిక్షన్ మూవీ కల్కి2898AD వరల్డ్ వైడ్ గా థియేటర్ల లో రిలీజ్ అయ్యింది. ఈ చిత్రం ప్రేక్షకులని, అభిమానులని విశేషం గా ఆకట్టుకుంటుంది. నేషనల్ వైడ్ గా సినిమా ఇప్పుడు హాట్ టాపిక్ గా మారుతోంది. ఈ చిత్రంలో బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్ అశ్వత్థామ పాత్రలో నటించారు. అయితే అమితాబ్ రోల్ చిత్రంలో ఎంతటి ఇంపాక్ట్ ను క్రియేట్ చేసిందో అందరికీ తెలిసిందే.

బాలీవుడ్ స్టార్ డైరెక్టర్లు కూడా ఈ రేంజ్ పాత్రను రీసెంట్ టైమ్ లో అమితాబ్ కి అందించలేకపోయారు. ఒక హీరోను టెక్నాలజీ ద్వారా యంగ్ గా చూపించి, మళ్ళీ వృద్ధాప్యం లో కూడా చూపించిన క్రెడిట్ అయితే మాత్రం కచ్చితంగా నాగ్ అశ్విన్ కే దక్కుతుంది. అమితాబ్ బచ్చన్ ఫ్యాన్స్ సైతం ఈ విషయంలో సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఈ చిత్రంలో బాలీవుడ్ స్టార్ హీరోయిన్ దీపికా పదుకునే, దిశా పటాని, యూనివర్సల్ స్టార్ హీరో కమల్ హాసన్ తదితరులు కీలక పాత్రల్లో నటించారు. సంతోష్ నారాయణన్ అధ్బుతమైన సంగీతం అందించారు.

Exit mobile version