క‌ల్కి: వెయిట్ చేస్తున్న అమితాబ్.. థ్యాంక్స్ చెబుతున్న నాగ్ అశ్విన్

క‌ల్కి: వెయిట్ చేస్తున్న అమితాబ్.. థ్యాంక్స్ చెబుతున్న నాగ్ అశ్విన్

Published on Jun 17, 2024 1:40 PM IST

పాన్ ఇండియా స్టార్ ప్ర‌భాస్ న‌టిస్తున్న తాజా చిత్రం ‘క‌ల్కి 2898 AD’ కోసం ప్రేక్ష‌కులు ఎంత ఆస‌క్తిగా ఎదురుచూస్తున్నారో అందరికీ తెలిసిందే. ఈ సినిమాను ద‌ర్శ‌కుడు నాగ్ అశ్విన్ తెర‌కెక్కించిన తీరుకు అభిమానులు స్ట‌న్ అవుతున్నారు. ఇప్ప‌టికే రిలీజ్ అయిన టీజ‌ర్, ట్రైల‌ర్లు ఈ సినిమాపై అంచనాల‌ను రెట్టింపు చేశాయి.

ఇక ఈ సినిమాలోని ఫ‌స్ట్ సింగిల్ సాంగ్ గా ‘భైర‌వ ఆంతెం’ను నేడు ఉద‌యం 11 గంట‌ల‌కు రిలీజ్ చేస్తామ‌ని మేక‌ర్స్ అనౌన్స్ చేశారు. అయితే, కొన్ని కార‌ణాల వ‌ల్ల ఈ సాంగ్ ఇంకా రిలీజ్ కాలేదు. దీంతో సోష‌ల్ మీడియాలో అభిమానులు మండిపడుతున్నారు. కాగా, ఈ సినిమాలో అశ్వ‌ద్ధామ పాత్ర‌లో న‌టిస్తున్న బాలీవుడ్ లెజెండ్ అమితాబ్ బ‌చ్చ‌న్ సైతం ఈ సాంగ్ కోసం ఎంతో ఆస‌క్తిగా ఎదురుచూస్తున్న‌ట్లు ట్వీట్ చేశారు.

దీనికి ద‌ర్శ‌కుడు నాగ్ అశ్విన్ రిప్లై ఇచ్చారు. సాంగ్ ను రెడీ చేయ‌డంలో చిత్ర టీమ్ పూర్తిగా నిమ‌ఘ్న‌మైంది. అయితే, కొన్ని కార‌ణాల వ‌ల్ల ఈ సాంగ్ రిలీజ్ డిలే అయ్యింది. మీ అంద‌రి ఎదురుచూపుల‌కు ఏమాత్రం త‌గ్గ‌కుండా ఈ సాంగ్ ఉంటుంద‌ని ఆయ‌న ట్వీట్ చేశారు. దీంతో ప్ర‌స్తుతం క‌ల్కి మ‌రోసారి నెట్టింట‌ ట్రెండ్ అవుతోంది. ఇక ఈ సినిమాలో క‌మ‌ల్ హాస‌న్, దీపిక ప‌దుకొనె, దిశా ప‌టాని, రాజేంద్ర ప్ర‌సాద్, మృణాల్ ఠాకూర్ త‌దిత‌రులు ఇత‌ర ముఖ్య పాత్ర‌ల్లో న‌టిస్తున్నారు. సంతోష్ నారాయ‌ణ‌న్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాను వైజ‌యంతి మూవీస్ బ్యాన‌ర్ పై అశ్విని ద‌త్ ప్రొడ్యూస్ చేస్తున్నారు. జూన్ 27న వ‌ర‌ల్డ్ వైడ్ గా ఈ సినిమా భారీ స్థాయిలో రిలీజ్ కానుంది..

సంబంధిత సమాచారం

తాజా వార్తలు