‘రణం 2’ తో హీరోగా మారిన డైరెక్టర్ ‘అమ్మ’ రాజశేఖర్

‘రణం 2’ తో హీరోగా మారిన డైరెక్టర్ ‘అమ్మ’ రాజశేఖర్

Published on Dec 29, 2014 10:00 AM IST

amma-rajashkar
మొదట కొరియోగ్రాఫర్ గా సినీ ఇండస్ట్రీకి పరిచయమైన అమ్మ రాజశేఖర్ ‘రణం’ సినిమాతో డైరెక్టర్ గా పరిచయమయ్యాడు. ఇప్పుడు అమ్మ రాజశేఖర్ ఓ రియలిస్టిక్ యాక్షన్ సినిమా అయిన ‘రణం 2’ తో హీరోగా పరిచయం అవుతున్నాడు. ఈ సినిమా గోపీచంద్ తో తీసిన ‘రణం’ సినిమాకి సీక్వెల్ గా తెరకెక్కించారు. మణిశర్మ మ్యూజిక్ అందించిన ఈ సినిమా ఆడియోని నిన్న సాయంత్రం గోపీచంద్ చేతుల మీదుగా రిలీజ్ చేసారు.

ఈ వేడుకలో ఆడియో రిలీజ్ తో పాటు ట్రైలర్ ని కూడా రిలీజ్ చేసారు. ఈ సినిమాలో స్వర్గీయ శ్రీహరి ఓ ముఖ్య పాత్ర పోషించాడు. అమ్మ రాజశేఖర్ , శ్రీహరి ఇద్దరూ రెండు డిఫరెంట్ గెటప్స్ లో కనిపించనున్నారు. గతంలో అమ్మ రాజశేఖర్ ‘రణం’, ఖతర్నాక్’, ‘టక్కరి’ సినిమాలకు దర్శకత్వం వహించాడు.

తాజా వార్తలు