‘హాయ్ నాన్న’ నుండి ‘అమ్మాడి’ సాంగ్ లాంచ్ ఈవెంట్ డీటెయిల్స్

‘హాయ్ నాన్న’ నుండి ‘అమ్మాడి’ సాంగ్ లాంచ్ ఈవెంట్ డీటెయిల్స్

Published on Nov 3, 2023 4:00 PM IST

నాచురల్ స్టార్ నాని హీరోగా మృణాల్ ఠాకూర్ హీరోయిన్ గా యువ దర్శకుడు శౌర్యువ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న లేటెస్ట్ లవ్, యాక్షన్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ మూవీ హాయ్ నాన్న. బేబీ కియారా ఖన్నా కీలక పాత్ర చేస్తున్న ఈ మూవీకి హేషం అబ్దుల్ వాహబ్ సంగీతం అందిస్తుండగా వైరా ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై మోహన్ చెరుకూరి, డాక్టర్ విజేందర్ రెడ్డి తీగల, మూర్తి కేఎస్ గ్రాండ్ గా నిర్మిస్తున్నారు. డిసెంబర్ 7న గ్రాండ్ గా ఆడియన్స్ ముందుకి రానున్న ఈ మూవీ నుండి ఇప్పటికే రిలీజ్ అయిన రెండు సాంగ్స్, ఫస్ట్ లుక్ టీజర్ అందరినీ ఆకట్టుకున్నాయి.

ఇక ఈ మూవీ నుండి అమ్మాడి అనే పల్లవితో సాగే మూడవ సాంగ్ ని రేపు రిలీజ్ చేయనున్నట్లు ఇప్పటికే మేకర్స్ ప్రకటించారు. అయితే మ్యాటర్ ఏమిటంటే, ఈ సాంగ్ ని హైదరాబాద్ లోని బిర్లా ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్సెస్ (BITS) లో రేపు మధ్యాహ్నం 3 గం. 30 ని. ల నుండి జరుగనున్న గ్రాండ్ ఈవెంట్ లో భాగంగా రిలీజ్ చేయనున్నామని కొద్దిసేపటి క్రితం మేకర్స్ ఒక పోస్టర్ ద్వారా తెలిపారు. కాగా ఈ సాంగ్ ప్రోమో ఇటీవల రిలీజ్ అయి సాంగ్ పై అందరిలో మంచి ఆసక్తిని ఏర్పరిచింది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు