పెళ్లిపై క్లారిటీ ఇచ్చిన ‘హనుమాన్’ హీరోయిన్

టాలీవుడ్‌లో తెరకెక్కిన ‘హనుమాన్’ మూవీ బాక్సాఫీస్ దగ్గర ఎలాంటి సెన్సేషన్ క్రియేట్ చేసిందో అందరికీ తెలిసిందే. ఈ సినిమా సక్సెస్‌తో దర్శకుడు ప్రశాంత్ వర్మ, హీరో తేజ సజ్జ కు చాలా మంచి గుర్తింపు వచ్చింది. అయితే, ఈ సినిమాలో హీరోయిన్‌గా నటించిన అమృత అయ్యర్‌కి మాత్రం అనుకున్న స్థాయిలో గుర్తింపు రాలేదని చెప్పాలి. ఇక ఇప్పుడు ఈ బ్యూటీ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘బచ్చల మల్లి’ రిలీజ్‌కు రెడీ అయ్యింది.

అల్లరి నరేష్ హీరోగా నటిస్తున్న ఈ సినిమాలో అమృత అయ్యర్‌కు మంచి స్కో్ప్ ఉన్న పాత్ర లభించింది. అయితే, ఈ చిత్ర ప్రమోషన్స్‌లో బిజీగా ఉన్న అమృత, తన పెళ్లికి సంబంధిచి ఓ స్టేట్‌మెంట్ ఇవ్వడం హాట్ టాపిక్‌గా మారింది. 2024 లో చాలా మంది స్టార్స్ పెళ్లి చేసుకున్నారు.. మరి అమృత పెళ్లి ఎప్పుడు..? అనే ప్రశ్నకు ఓ ఇంటర్వ్యూలో ఆమె సమాధానం ఇచ్చింది.

ఖచ్చితంగా 2025 లో పెళ్లి చేసుకుంటానని అమృత క్లారిటీ ఇచ్చింది. అయితే, సినిమా ఫీల్డ్‌తో సంబంధం లేని వ్యక్తిని తాను పెళ్లాడుతానని.. ఒకే రంగంలో ఉంటే మనస్పర్థలు వస్తాయి.. వేర్వేరు రంగాల్లో ఉంటే మనస్పర్థలు రావని ఆమె తెలిపింది. దీంతో అమృత అయ్యర్ తన వివాహం పై క్లారిటీ ఇచ్చేసిందని అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

Exit mobile version