వర్మపై అమృత న్యాయపోరాటం.

Published on Aug 5, 2020 1:15 am IST

ఆ మధ్య తెలంగాణాలో జరిగిన ఓ పరువు హత్య సంచలనం రేపిన సంగతి తెలిసిందే. అమృత అనే యువతి భర్త ప్రణయ్ ని రోడ్డుపై అందరూ చూస్తుండగానే ఓ హంతకుడు నరికి చంపాడు. కాగా ఇదే సంఘటన ఆధారంగా వర్మ మర్డర్ పేరుతో ఓ మూవీ చేస్తున్నారు. ప్రకటన సమయంలోనే ఈ మూవీపై మరియు వర్మపై అమృత ఆవేదన, ఆక్రోశం వ్యక్తం చేశారు. మర్డర్ ట్రైలర్, సాంగ్స్ మరింత వివాదాస్పదంగా ఉన్న నేపథ్యంలో అమృత న్యాయపోరాటానికి దిగారు.

మర్డర్ సినిమా నిర్మాతలకు అమృత కోర్టు ద్వారా నోటీసులు పంపారు. అనుమతులు లేకుండా తన కథ ఆధారంగా సినిమా తీస్తున్నారంటూ ఆమె నల్గొండ డిస్ట్రిక్ట్ కోర్టులో పిటిషన్ వేశారు. ఈ మేరకు ఆమె కోర్టు ద్వారా మర్డర్ సినిమా నిర్మాతలు నట్టి క్రాంతి, నట్టి కరుణలకు నోటీసులు పంపారు. అయితే మర్డర్ చిత్రానికి క్రాంతి, కరుణలతో పాటు రామ్ గోపాల్ వర్మ కూడా నిర్మాణ భాగస్వామిగా వ్యవహరిస్తున్నారు. అయితే అమృత, ఆర్జీవీకి నోటీసు పంపకపోవడం గమనార్హం. మర్డర్ సినిమా విడుదలను నిలుపదల చేయాలని, పబ్లిసిటీ వెంటనే ఆపమని కోరుతూ అమృత కోర్టును కోరారు. కాగా ఈ నెల 6న నిర్మాతలు కోర్టుకు హాజరై, వారి వాదనను తెలపాలని కోర్టు నోటీసుల్లో పేర్కొంది.

సంబంధిత సమాచారం :

More