నటి అమీ జాక్సన్ కొంతకాలంగా హాలీవుడ్ నటుడు ఎడ్ వెస్ట్‌విక్ తో ప్రేమలో ఉన్న విషయం తెలిసిందే. ఐతే ఎట్టకేలకు అమీ జాక్సన్ తన ప్రియుడితో వివాహ బంధంలోకి అడుగు పెట్టింది. వీరి పెళ్లి వేడుక ఇటలీలో ఘనంగా జరిగింది. సోషల్ మీడియా వేదికగా ఇరువురు తమ వెడ్డింగ్ పిక్స్ ను అమీ జాక్సన్ పోస్ట్ చేస్తూ.. ‘కొత్త ప్రయాణం ఇప్పుడే మొదలైంది..’ అంటూ ఓ కాప్షన్ కూడా ఇచ్చింది. ఐతే, గతంలో జార్జ్ పనియోటౌ అనే వ్యాపారవేత్తతో అమీ జాక్సన్ రిలేషన్‌షిప్‌లో ఉంది.
కొంతకాలం పాటు సహజీవనం తర్వాత ఆ జంట పెళ్లి కూడా చేసుకుంది. వీరికి ఆండ్రూ అనే బాబు కూడా జన్మించాడు. ఐతే, ఆ తర్వాత అమీ-జార్జ్ మధ్య మనస్పర్థలు రావడంతో విడిపోయారు. ఆ ప్రయాణం అలా ముగిసింది. ఇప్పుడు అమీ జాక్సన్ హాలీవుడ్ నటుడు ఎడ్ వెస్ట్‌విక్ తో ‘కొత్త ప్రయాణం మొదలు పెట్టింది. మరి ఈ ప్రయాణం ఎన్నాళ్ళు సాగుతుందో చూడాలి. కాగా రామ్ చరణ్ మూవీ ‘ఎవడు’తో పాటు, ‘ఐ’, ‘2. ఓ’ తదితర చిత్రాలలో అమీ జాక్సన్ నటించి ఆకట్టుకుంది.