‘క‌ల్కి’ అన్నింటికీ ముగింపు – నాగ్ అశ్విన్

‘క‌ల్కి’ అన్నింటికీ ముగింపు – నాగ్ అశ్విన్

Published on Jun 18, 2024 4:26 PM IST

స్టార్ హీరో ప్ర‌భాస్ అభిమానుల‌తో పాటు ‘కల్కి’ మూవీ కోసం ఎదురుచూస్తున్న ఫ్యాన్స్ కు మేక‌ర్స్ సాలిడ్ ట్రీట్ ఇచ్చారు. ‘క‌ల్కి’ ప్ర‌పంచానికి సంబంధించిన జ‌ర్నీని ఓ వీడియో రూపంలో ద‌ర్శ‌కుడు నాగ్ అశ్విన్ ప్రేక్ష‌కుల‌కు ప‌రిచ‌యం చేశారు.

ఈ సినిమా క‌థకు సంబంధించిన ప‌లు విష‌యాల‌ను ఆయ‌న షేర్ చేసుకున్నారు. ఈ క‌థ అన్నింటికీ ముగింపు అంటూ చెప్పుకొచ్చారు ఈ విజ‌న‌రీ డైరెక్ట‌ర్. కేవ‌లం ఇండియాలోనే కాకుండా ప్ర‌పంచంలోని ఏ వ్య‌క్తైనాఈ క‌థ‌ను రిలేట్ చేసుకోవ‌చ్చ‌ని తెలిపారు.

“మ‌న పౌరాణిక చిత్రాలైన పాతాళ భ‌ర‌వి, భైర‌వద్వీపం, ఆదిత్య 369 లాంటివి స‌రికొత్త క‌థ‌ల‌తో ప్రేక్ష‌కుల‌ను ఆక‌ట్టుకున్నాయి. అయితే, హాలీవుడ్ లో వ‌చ్చిన స్టార్ వార్స్ వంటి చిత్రాలు చూసిన‌ప్పుడు ఇలాంటివి మ‌న ద‌గ్గ‌ర జ‌ర‌గ‌వా..? అనే సందేహం ఏర్ప‌డింది. మన పురాణాల్లో రాసిన గ్రేటెస్ట్ బ్యాటిల్ ‘మ‌హాభారతం’లో శ్రీ‌కృష్ణుడి అవ‌తారం త‌రువాత క‌లియుగంలో ఈ క‌థ ఎలా వెళ్తుంది అనేది కొత్త‌గా చూపించే ప్ర‌య‌త్నం చేయొచ్చు..” అని ఆయ‌న తెలిపారు.

“క‌లియుగంలో ద‌శావ‌తార‌మైన క‌ల్కి ఎలా ఉంటుంది.. ఆ పాత్రతో ఎలాంటి క‌థ రాసుకోవ‌చ్చు అని ఆలోచించి ఈ క‌థ రాసుకున్నాను. దీనికి 5 ఏళ్ల స‌మ‌యం ప‌ట్టింది. ఇది ఆడియెన్స్ లో ఎలాంటి క్యూరియాసిటీని మిగిలిస్తుందా అనేది చూడాలి..” అంటూ నాగ్ అశ్విన్ క‌ల్కి మూవీకి సంబంధించిన ప్ర‌యాణాన్ని అభిమానుల‌తో పంచుకున్నారు.

వీడియో కోసం ఇక్కడ క్లిక్ చేయండి

సంబంధిత సమాచారం

తాజా వార్తలు